క్రీడలు లేని ప్రాంగణాలు | - | Sakshi
Sakshi News home page

క్రీడలు లేని ప్రాంగణాలు

May 1 2025 2:01 AM | Updated on May 1 2025 2:01 AM

క్రీడ

క్రీడలు లేని ప్రాంగణాలు

జిల్లా వివరాలు

మండలాలు :18 మున్సిపాలిటీలు : 3

మండలాల పరిధిలో

క్రీడా ప్రాంగణాలు :582

మున్సిపాలిటీల పరిధిలో క్రీడా ప్రాంగణాలు : 23

2023లో జిల్లాకు చేరిన స్పోర్ట్స్‌ కిట్లు : 656

నిర్మల్‌చైన్‌గేట్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో మూడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో ప్రాంగణానికి క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కానీ వాటిని బయటకు తీసి ఆటలు ఆడిన దాఖలాలు ఎక్కడా లేవు.

2022, జూన్‌ 2న ప్రారంభం

జిల్లాలోని అన్ని మండలాల్లో రెండు చొప్పున క్రీడా ప్రాంగణాలను 2022 జూన్‌ 2న అధికారులు ప్రారంభించారు. ఆ తర్వాత మిగతా గ్రామాల్లో దశల వారీగా ఆరంభించారు. తొలుత వాలీబాల్‌, ఖోఖోలకు తప్ప మిగతా క్రీడలకు అవసరమయ్యే క్రీడా పరికరాలు పంపిణీ చేయలేదు. దీంతో జిల్లాలోని 582 క్రీడా ప్రాంగణాలు నామమాత్రంగా మారాయి. ప్రాంగణాలు చిన్నగా ఉండడం, క్రీడా సామగ్రి లేకపోవడంతో యువత, విద్యార్థులు ఆటలు ఆడేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా సుమారు మూడేళ్లుగా వినియోగం లో లేక క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. వీటిని వినియోగంలోకి తెచ్చి క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో 2023లో గ్రామ పంచాయతీలకు స్పోర్ట్స్‌ కిట్లు పంపిణీ చేశారు.

అలంకారప్రాయంగానే..

గ్రామాల పరిధిలో అరెకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండడంతో స్మశాన వాటికల పక్కన, పాఠశాలల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్ది పాటి స్థలాల్లో తెలంగాణ ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్‌ కోర్టు, వ్యాయామం చేసేందుకు రెండు పరికరాలు ఏర్పాటు చేసి నామ్‌కే వాస్తేగా వదిలేశారు. కొన్నిచోట్ల కేవలం క్రీడా ప్రాంగణం పేరుతో బోర్డులు పెట్టి ఇతరత్రా వసతులను మరిచారు. ఇక పట్టణాల్లోనూ వార్డుకో క్రీడా ప్రాంగణం ఉండాల్సి ఉండగా స్థలం కొరత వల్ల మూడు మున్సిపాలిటీల పరిధిలో 23 ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి ఆధ్వానంగా మారాయి. మరోవైపు నిధుల కొరత వల్ల పంచాయతీలు వీటి నిర్వహణ చేపట్టలేక పూర్తిగా గాలికొదిలేశాయని పలువురు పేర్కొంటున్నారు.

గతంలో పంపిణీ చేసిన స్పోర్ట్స్‌ కిట్స్‌లోనిసామగ్రి

స్పోర్ట్స్‌ కిట్లలో మేజరింగ్‌ టేపు 1, డిస్కస్‌ త్రో 1, 2 కిలోలు, టెన్నికాయిట్‌ రింగులు 6, స్కిప్పింగ్‌ రోప్‌లు 4, ప్లాస్టిక్‌ విజిల్స్‌ 3, స్టాప్‌ అండ్‌ గో వాడెస్‌ 1, సింథటిక్‌ వాలీబాల్‌ 1, నెట్‌ 1, సైకిల్‌ పంపు, బిగ్‌ సైజ్‌ (ఫుట్‌ పంపు)1 ఉంటాయి. డంబెల్స్‌ మూడు సెట్లు, టీషర్లు 75, క్రికెట్‌ బ్యాట్‌ నెం.5, కశ్నీర్‌ విల్లో 1, ఫుల్సైజ్‌ బ్యాట్‌ 1, బ్యాటింగ్‌ గ్లౌజులు ఒకజత, లెగ్‌ ప్యాడ్లు రెండు జతలు, వికెట్‌ కీపింగ్‌ లెగ్‌ గార్డు ప్యాడ్‌ ఒక జత, స్టంప్స్‌ సెట్‌ 2 జతలు, లబ్డామినల్‌ గార్డ్స్‌ 2 జతలు, ప్రాక్టీస్‌ బాల్స్‌ 6, ఆర్మ్‌ గార్డ్స్‌ 2, దైప్యాడ్లు 4, క్రికెట్‌ కిట్‌ బ్యాగ్‌ 1 ఉన్నాయి.

లక్ష్యానికి దూరంగా క్రీడా మైదానాలు

పంచాయతీలకే పరిమితమైన స్పోర్ట్స్‌ కిట్లు

వేసవి దష్ట్యా వినియోగంలోకి తెస్తే మేలు

అటకెక్కిన క్రీడా సామగ్రి

జిల్లాలోని పలు క్రీడా ప్రాంగణాలకు 2023 అక్టోబర్‌లో 605 కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో క్రీడా యూనిట్‌ విలువ రూ.68 వేలు ఉంటుంది. ఇందులో జిమ్‌ పరికరాలతో పాటు క్రికెట్‌, వాలీబాల్‌ ఆటలకు సంబంధించిన సామగ్రి ఉంది. కానీ చాలా చోట్ల వినియోగంలో లేక గ్రామ పంచాయతీ గదుల్లో మూలన పడేశారు. ఇప్పటికై నా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.

వినియోగంలోకి తేవాలి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. వాటిలో సరైన వసతులు లేకపోవడంతో ఆదరణకు నోచుకోవడం లేదు. వీటిపై పర్యవేక్షణ కొరవడటంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవుల దష్ట్యా అధికారులు చొరవ తీసుకొని ప్రాంగణాలను వినియోగంలోకి తేస్తే యువతకు మేలు జరుగుతుంది.

– కుందారం శివకుమార్‌, న్యూ వెల్మల్‌

క్రీడలు లేని ప్రాంగణాలు 1
1/2

క్రీడలు లేని ప్రాంగణాలు

క్రీడలు లేని ప్రాంగణాలు 2
2/2

క్రీడలు లేని ప్రాంగణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement