నిర్మల్ రూరల్: డీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా చంద్ర నాగకాంత్, ఉపాధ్యక్షులుగా రమేశ్, శకుంత ల, ప్రధాన కార్యదర్శులుగా మహేంద్రాచారి, గొలుసుల నర్సయ్య, శ్రీనివాస్, దుర్గం సుగుణాకర్, రాష్ట్ర కౌన్సిలర్‌గా దేశ్‌పాండే మధుసూదన్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా దళితానంద్, సభ్యులుగా దత్తాద్రి, లాలు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని వారంతా హామీ ఇచ్చారు.


