
సర్టిఫికెట్లు పొందిన మహిళలు
నిర్మల్‌టౌన్: స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అందుకు ఆర్థిక సహకారం అందిస్తామని ఐడీఎం చంద్రశేఖర్ తెలిపారు. సబ్బులు, డిటర్జెంట్, ఫినాయిల్, టాయిలెట్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారీలో శిక్షణ పొందిన మహిళా సంఘాల సభ్యులకు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమి టీ హాల్‌లో శుక్రవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల రోజులపాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన వా రు తయారు చేసే వస్తువులు నాణ్యత లోపించకుండా ఉండాలన్నారు. మహిళా సంఘం స భ్యులు మాట్లాడుతూ.. స్వయం ఉపాధి శిక్షణ తమకు ఆర్థికంగా తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సు భాష్, శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.