వివాహితపై నలుగురి అత్యాచారం... ప్రస్తుతం 4 నెలల గర్భవతి | Married Woman Raped By 4 People In Adilabad, Present 4 Months Pregnant - Sakshi
Sakshi News home page

వివాహితపై నలుగురి అత్యాచారం... ప్రస్తుతం 4 నెలల గర్భవతి

Published Tue, Oct 3 2023 1:00 AM

- - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: వివాహితపై నలుగురు లైంగికదాడికి పాల్పడిన ఘటన మావల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై విష్ణువర్ధన్‌ తెలి పిన వివరాల ప్రకారం.. మావల గ్రామంలో నివాసం ఉంటున్న వివాహితకు 2014 లో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో వారికి ముగ్గురు సంతానం అయ్యారు. భర్త మూడేళ్ల క్రితం ఆమెను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

కూలీ పనులు చేసుకుంటూ ఆమె పిల్లలతో పాటు తల్లి, సోదరుడితో కలిసి మావల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి వేర్వేరు సందర్భాల్లో కొద్ది రోజులుగా లోబర్చుకున్నారు. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి కావడంతో విషయం బయటపడింది.

దీంతో ఆమె శనివారం పోలీసులకు తనపై కొంతకాలంగా నలుగురు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి కేసు నమోదైంది. ఆమెను లోబరుచుకున్న నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామని ఎస్సై వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement