లక్ష్మణచాంద: నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జి డీఏవో సుజాత హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను గురువా రం తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించారు. డీలర్లందరూ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అనంతరం రైతు వేదికలో రైతులతో మాట్లాడారు. ఎల్నినో నేపథ్యంలో రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు కంది, పెసర, మినుములు, బొబ్బర్లు, నూనె గింజలు, వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని వివరించారు. ఇందులో ఎంఏవో నాగరాజు, ఏఈవో పవిత్ర తదితరులు పాల్గొన్నారు.


