నిర్మల్చైన్గేట్: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చ్రర్ ఫండ్, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.


