నిర్మల్‌చైన్‌గేట్: పెండింగ్‌లో ఉన్న బీఎల్‌వో సర్వే బకాయిలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఒక్కో అంగన్‌వాడీ టీచర్‌కు రూ.14 వేల చొప్పున బీఎల్‌వో బకాయిలు జమ అయినప్పటికీ, జిల్లాలో మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోనే జమ చేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ బీఎల్‌వో బిల్లులపై సంతకాలు చేసి ట్రెజరీకి పంపించామని తెలిపారు. సంబంధిత కాపీని యూనియన్ నాయకులకు అందజేశారు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నామని, ట్రెజరీ నుంచి వెంటనే నిధులు విడుదలయ్యేలా చూడాలని నాయకులు కలెక్టర్‌ను కోరారు. ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.లలిత, శైలజ, కోశాధికారి ప్రసాద, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా, పద్మ, సదా, కవిత, భాగ్య, రమ్య, సహాయ కార్యదర్శులు సావిత్రి, వాణి, సత్య, సునీత పాల్గొన్నారు.


