ప్రతీ కూలీకి పని కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కూలీకి పని కల్పించాలి

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

లక్ష్మణచాంద: వీబీజీ రామ్‌జీ పథకంలో ప్రతీ కూలీకి 125 రోజులు పని కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని చింతల్‌చాందలో వీబీజీ రామ్‌జీ పథకంలో చేపడుతున్న చెరువు పూడిక తీత పనులను గురువారం పరిశీలించారు. చామన్‌పెల్లి గ్రామంలోని రైతు ఏలేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా సాగు చేస్తున్న కోకో పంటను ఆయన పరిశీలించారు. అనంతరం సోన్‌ మండలం పాక్‌పట్ల, గాంధీనగర్‌ గ్రామాల్లో వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపడుతున్న చెరువుల పూడికతీత పనులు పరిశీలించారు. చెరువుల్లో పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల నిర్వహణ తీరును సమీక్షించారు. ప్రభుత్వ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement