మోదీ భజన చేసే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి | Youths chanting Modi Modi should be slapped Karnataka Minister | Sakshi
Sakshi News home page

మోదీ భజన చేసే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి

Mar 25 2024 7:36 PM | Updated on Mar 25 2024 7:40 PM

Youths chanting Modi Modi should be slapped Karnataka Minister - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, ప్రధానిని పొగిడే యువత చెంప పగలగొట్టాలని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి అన్నారు. 

కారటగిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేయవచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. ఇచ్చారా? మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి. వాళ్ల చెంప పగలగొట్టాలి.  పదేళ్లుగా అబద్ధాలతోనే నడిపించారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

‘దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఇస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పండి’ అని ప్రశ్నించారు. ‘ఆయన (ప్రధాని మోదీ) తెలివైనవాడు. బాగా దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు. సముద్రపు లోతుల్లోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని ఇదేనా?’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement