సార్‌.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి! | Sakshi
Sakshi News home page

సార్‌.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!

Published Mon, Oct 30 2023 5:16 AM

Youth in love seeks money from BJP leader for going on first date - Sakshi

కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్‌ అధ్యక్షుడు టెమ్‌జెన్‌ ఇమ్నా అలోంగ్‌ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్‌’లో వివరించారు.

ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్‌లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్‌ఫ్రెండ్‌తో మొద టిసారిగా డేటింగ్‌కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్‌’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్‌’లో అలోంగ్‌ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు.

యువకు డితోపాటు డేటింగ్‌కు వెళ్లాలంటూ అలోంగ్‌కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్‌ బోయ్‌ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement