కువైట్‌లో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసులో అప్పీల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. తన ప్రేయసిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో దాచి దేశం దాటించేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మరణశిక్షను కువైట్ అప్పీల్ కోర్టు ఖరారు చేసింది.
గతేడాది మేలో కువైట్‌లోని రుమైతియా ప్రాంతంలో నిందితుడు తన ప్రేయసితో గొడవ పడి, ఆమెను అతి క్రూరంగా గొంతు నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టి దేశం దాటించేందుకు ప్రయత్నించాడు. అయితే సరిహద్దు వద్ద తనిఖీల్లో భాగంగా అతడి సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని కువైట్ క్రిమినల్ కోర్టు దోషిగా తెలుస్తూ మరణశిక్ష విధించింది. అయితే నిందితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ కోర్టును ఆశ్రయించాడు. కానీ అబ్దుల్లా అల్ ఒత్మాన్ నేతృత్వంలోని ధర్మాసనం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించి అతడికి ఉరిశిక్షే సరైనదని తుది తీర్పునిచ్చింది. ఇది అతడు ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యేనని కోర్టు నిర్ధారించింది.
చదవండి: Pakistan: కరాచీ మాల్ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు


