స్నేహితులని హామీ ఉన్నందుకు..చివరకు సెల్ఫీ వీడియో తీసుకుని..

Young Man Committed Suicide Unable To Bear Harassment Of Debtors  - Sakshi

సాక్షి, బనశంకరి: అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు వాసుదేవనపురలో శివరాజ్‌ (33) హెయిర్‌సెలూన్‌ నిర్వహిస్తున్నారు. శివరాజ్‌ స్నేహితులకు జామీను పడి అప్పు ఇప్పించాడు. దీంతో శివరాజ్‌ ప్రతివారం వడ్డీ చెల్లించేవాడు.

ఇటీవల అధిక వడ్డీ చెల్లించలేదని రేణుకారాధ్య, ధను, వెంకటేశ్‌ అనే ముగ్గురు శివరాజ్‌ బైక్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో మానసిక వేధింపులకు గురవుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసిన శివరాజ్‌ ఈనెల 3న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి భార్య కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.     

(చదవండి: ఎన్‌ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు )

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top