క్లోనింగ్‌ ముప్పు : తక్షణమే ఆధార్‌ బయోమెట్రిక్ డేటా లాక్‌ చేయండి ఇలా..!

You can prevent the misuse of Aadhaar biometric data by simply locking check here - Sakshi

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్‌  నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్టం పడటం లేదు.సైబర్ క్రైం నేరాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి.  మనం  ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఆధునిక  టెక్నాలజీని  ఉపయోగించుకుని  సైబర్‌ మోసానికి  పాల్పడుతున్న కొత్త తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేలిముద్రతో తస్కరించి  బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు కాజేసిన ఘటన ఆందోళన రేపుతోంది.  క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా దాదాపు   లక్షల మేర టోకరా వేస్తున్నారు. 
 
బ్యాంకు సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా, కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా,  చివరికి మొబైల్‌ సిమ్‌  కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్‌తోపాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరం ఉన్న ప్రతి చోటా ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తాం.  దీన్ని అదునుగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు  పౌరుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు స్వాహా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్  డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ క్రమంలో  UIDAI పోర్టల్‌ ద్వారా  బయోమెట్రిక్ డేటా లాక్ లేదా అన్ లాక్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 

బయోమెట్రిక్ లాకింగ్‌ ఎలా? 
♦ ముందుగా మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. 
 మైఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి.
స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో లాక్, అన్‌లాక్ మీకు ఎలా ఉపయోగపడుతుందనేది వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది.  తరువాత టర్మ్స్ బ్యాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి.
♦ Your Biometric Have Been Locked Successfully (బయో మెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడింది’) అనే సందేశం డిస్‌ప్లే అవుతుంది.
లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది.

బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలా?
♦పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. ఇలా ఉంటే  బయోమెట్రిక్ లాక్ అయినట్టే.
♦అన్‌లాక్  ప్రక్రియ కోసం  Please Select To Lock  టిక్ చేసిన తరువాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి
♦బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని  మెసేజ్‌ కనిపిస్తుంది. ఇక్కడ  కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని, నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి
♦Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది.
♦ తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే  బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది అనేది గమనించాలి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top