స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష | Woman Jailed For 6 Years For Attempted Robbery At Friends House | Sakshi
Sakshi News home page

స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష

Jan 2 2023 9:31 AM | Updated on Jan 2 2023 9:31 AM

Woman Jailed For 6 Years For Attempted Robbery At Friends House - Sakshi

సాక్షి, మండ్య: స్నేహితురాలి ఇంటిలో చోరీకి పాల్పడిన మహిళకు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మద్దూరు పట్టణం జేఎంఎఫ్‌ 1వ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి వీ కోనప్ప  తీర్పు వెలువరించారు.  మద్దూరు తాలూకా తొరెశెట్టిహళ్లికి చెందిన సుమిత్ర, జయమ్మలు స్నేహితులు.

2012 డిసెంబర్‌ 31న సుమిత్ర పక్క వీధిలో మంచినీటి కోసం వెళ్లిన సమయంలో బీరువాలోని రూ.1.16లక్షల విలువైన 58 గ్రాముల నగలు, రూ.18వేల నగదును జయమ్మ చోరీ చేసింది. సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జయమ్మను అరెస్ట్‌ చేశారు.  నిందితురాలి నేరం రుజువు కావడంతో  జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.  

(చదవండి: ఏటీఎం కార్డు మర్చిపోయానని భార్యని దుకాణంలో కుర్చోపెట్టి.. కాసేపు తర్వాత!ఝ)

Advertisement
 
Advertisement
Advertisement