మూడేళ్ల క్రితం రెండో పెళ్లి.. భర్త వేధింపులు భరించలేక..

Wife Commits Suicide Because Of Husband Abuse - Sakshi

బనశంకరి: అందంగా లేవంటూ భర్త పెట్టే వేధింపులు భరించలేక యువతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నాటకలో డీజే హళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం నిజాముద్దీన్‌ అనే వ్యక్తిని అనిశా(33) రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్లు, ఆరు నెలల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ క్రమంలో అందంగా లేవంటూ అనిశాను భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆమె బంధువులు ఆరోపించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై గొడవ పడ్డారు. దీంతో, భర్త వేధింపులతో మనోవేదనకు గురైన అనిశా.. ఒంటిగంట సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు డీజే హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: నెల రోజుల క్రితమే పెళ్లి.. లవర్‌తో కలిసి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top