వాటర్‌ బాటిల్‌లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది? | Does Water In The Water Bottle Have An Expiry Date Or Not? Know What Scientists Says About It - Sakshi
Sakshi News home page

Does Bottled Water Go Bad?: వాటర్‌ బాటిల్‌లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?

Published Sat, Mar 16 2024 8:36 AM

Water Bottled Expired Or Not - Sakshi

నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే  క్లోజ్డ్ బాటిల్‌లోని నీటికి గడువు  తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్‌ బాటిల్‌పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్‌ బాటిల్‌లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్‌లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత  ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్‌ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్‌ గడువు తేదీ అని దాని అర్థం.

వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని  ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు.

కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి,  ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. 

 
Advertisement
 
Advertisement