వామ్మో.. ముందు టైర్‌ను అమాంతం గాల్లో పైకెత్తాడు.. వైరల్‌ వీడియో..

Viral Video: Bike Stunt Goes Horribly Wrong Man Breaks Neighbours Wall - Sakshi

బెంగళూరు: కొంత మంది యువకులు అర్ధరాత్రికాగానే రోడ్డుపై వచ్చి ఇష్టమోచ్చినట్లు వాహనాలను నడుపుతుండటం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వీరు అత్యధిక వేగంతో తమ బైక్‌లను నడుపుతూ..   రకారకాల స్టంట్‌లు చేస్తుంటారు.  కొంత మంది యువకులు బైక్ నడుపుతున్నప్పుడు హ్యండిల్‌ను వదిలేస్తే.. మరికొందరు ఆకతాయిలు ముందు టైర్‌ను లేదా వెనుక టైర్‌ను గాల్లో అమాంతం పైకి ఎత్తి వెరైటీ డ్రైవ్‌ చేస్తుంటారు. అయితే, ఇలాంటి స్టంట్‌లు చేసే క్రమంలో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

కాగా, ఒక యువకుడు తన మోటర్‌బైక్‌తో చేసిన స్టంట్‌ ఇ‍ప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యువకుడు రోడ్డుపై బైక్‌ స్టంట్‌ చేస్తున్నాడు. అక్కడ రోడ్డంతా వర్షం నీరుతో నిండి ఉంది. అతను ఏమాత్రం భయపడకుండా.. అలాగే బైక్‌ను స్టార్ట్‌ చేశాడు. అంతేకాకుండా.. బైక్‌ను వేగంగా నడిపిస్తూ ముందు టైర్‌ను అమాంతం గాల్లో పైకి లేపాడు. అతగాడి విన్యాసాన్ని చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నారు. అయితే, ఆ యువకుడు తొలుత బైక్‌ను బాగానే నడిపినా ఆ తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పింది.

దీంతో అతను పక్కనే ఉన్న ఒక ప్రహరీ గొడను ఢీకొడుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ షాకింగ్‌ ఘటనతో అక్కడి వారంతా దూరంగా పారిపోయారు. మోటర్‌ బైక్‌ ఢీకొని గోడంతా కూలిపోయింది. ఆ యువకుడు హెల్మెట్‌ పెట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని.. స్ప్లెండర్‌ బుల్లెట్‌ లవ్‌ అనే యూజర్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్‌.. ఏమన్న స్టంటా..’, ‘కొంచెంలో మిస్‌ అయ్యాడు..’, ‘ఇలాంటి ప్రమాదకర స్టంట్‌లు అవసరమా..’ అంటూ కామెం‍ట్లు పెడుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top