నోట్ల కట్టల బ్యాగుతో శివసేన ఎమ్మెల్యే | Video Goes Viral Maha Minister Seen With Bag Allegedly Full Of Cash | Sakshi
Sakshi News home page

నోట్ల కట్టల బ్యాగుతో శివసేన ఎమ్మెల్యే

Jul 11 2025 4:46 PM | Updated on Jul 12 2025 6:13 AM

Video Goes Viral Maha Minister Seen With Bag Allegedly Full Of Cash

 

ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్‌ చేసిన ఎంపీ రౌత్‌

ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన(షిండే) నేత, రాష్ట్ర మంత్రి సంజయ్‌ షిర్సత్‌ డబ్బు నిండిన బ్యాగుతో కనిపిస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఈ వీడియోను ప్రతిపక్ష శివసేన(యూబీటీ)కి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం పోస్ట్‌ చేశారు. సంజయ్‌ షిర్సత్‌ తన బెడ్‌రూంలో కూర్చుని సిగరెట్‌ తాగుతూండగా, పక్కనే నిండా నోట్ల కట్టలున్న బ్యాగు తెరిచి ఉంది. మరో సూట్‌ కేస్, ఆయన పెంపుడు కుక్క కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘ఆసక్తికరమైన ఈ వీడియోను గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, సీఎం ఫడ్నవీస్‌ చూడాలి. 

దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. మహారాష్ట్ర మంత్రి గురించిన చాలా విషయాలు ఈ వీడియోతో తెలుస్తాయి’అని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. సంజయ్‌ రౌత్‌ చేసిన ఆరోపణలను సామాజిక న్యాయ శాఖ మంత్రి షిర్సత్‌ ఖండించారు. ఆ బ్యాగులో కనిపించేవి కరెన్సీ నోట్లు కావు..తన దుస్తులని చెప్పారు. ఇదంతా కావాలని చేసిన కుట్రగా పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో ఆయన వెల్లడించిన ఆస్తుల విలువ రూ.3.3 కోట్లు కాగా, 2024 నాటికి రూ.35 కోట్లకు పెరిగాయంటూ షిర్సాత్‌ చూపడంపై ఐటీ వివరణ కోరింది. ఐటీ నోటీసుకు తగు విధంగా సమాధానమిస్తానని చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్నారు.  

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement