కోల్‌కతా: దేశంలో మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ రైలు సర్వీసుకు సంబంధించిన టికెట్లు క్షణాల్లో హాట్‌కేకుల్లా అమ్మడుపోయాయని రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. తొలి స్లీపర్ వందేభారత్‌ను జనవరి 17వ తేదీన పశ్చిమబెంగాల్‌లోని మాల్డాలో ప్రధాని మోదీ ప్రారంభించడం తెల్సిందే. ఈ రైలు గువాహటిలోని కామాఖ్య, కోల్‌కతా సమీపంలోని హౌరా స్టేషన్‌ల మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రైలు గురువారం తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.


