గుజరాత్‌లో గ్రామమంతా వ్యభిచారంలో.. | Vadia Families Turn to Engagements to Keep Girls Out of Molestation Trade | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో గ్రామమంతా వ్యభిచారంలో..

Sep 21 2026 5:41 AM | Updated on Sep 21 2026 5:41 AM

Vadia Families Turn to Engagements to Keep Girls Out of Molestation Trade

శాపంగా మారిన పేదరికం, కరువు కాటకాలు  

వాడియా: నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం, కరువు కాటకాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం మహిళల పాలిటి శాపంగా మారుతున్నాయి. బతుకు తెరువు కోసం బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దిగాల్సి వస్తోంది. చిన్న వయసులోనే మనసు చంపుకొని పరాయి పురుషులకు ఒళ్లు అప్పగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. గుజరాత్‌ రాష్ట్రం బనస్కాంత జిల్లాలోని వాడియా గ్రామంలో దశాబ్దాలుగా ఈ అనాచారం కొనసాగుతోంది.

 ఇదొక గిరిజన గ్రామం. అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామ జనాభా 750 కాగా, వీరిలో 350 మంది మహిళలు. దాదాపు అందరూ పడుపు వృత్తిలో∙కొనసాగుతున్నారు. భర్తలు, కుటుంబ సభ్యులే వారిని ప్రోత్సహిస్తుంటారు. ఏజెంట్లుగా మారి విటులను తీసుకొస్తుంటారు. నిత్యం ఉదయాన్ని రోడ్డు పక్కన నిలబడి విటులతో బేరమాడే దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం. దీంతో వాడియాకు ‘వ్యభిచారుల గ్రామం’గా పేరు స్థిరపడింది. 

వ్యభిచారం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం చిన్న వయసులో నిశ్చితార్థం చేసుకోవడం. తమ బిడ్డలను ఈ రొంపిలోకి దింపడం ఇష్టపడని తల్లులు వారికి 7 నుంచి 13 ఏళ్లలోపే పొరుగు గ్రామాల పురుషులతో నిశ్చితార్థం జరిపిస్తుంటారు. నిశ్చితార్థం జరిగినవారు, పెళ్లి చేసుకున్నవారు ఈ వృత్తికి ప్రవేశించడానికి అనుమతి లేదు. 18 ఏళ్లలోపు వివాహాలు జరుగుతుంటాయి. అంటే ఇవన్నీ బాల్య వివాహాలే. వాడియా గ్రామంలో వ్యభిచారం తరతరాలుగా కొనసాగుతుండడం గమనార్హం.  

సామూహిక నిశ్చితార్థాలు, వివాహాలు  
వాడియాలో వ్యభిచారం నుంచి మహిళలను తప్పించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరిగాయి. కొందరు స్వయం ఉపాధితో జీవితాలు మార్చుకున్నారు. మరికొందరు మాత్రం అదే వృత్తిలో కొనసాగుతున్నారు. కొందరికి ప్రభుత్వం నుంచి భూములు ఇప్పించినప్పటికీ కరువు వల్ల పంటల సాగు చేయలేని పరిస్థితి. 

2012లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్జీఓలు వాడియాలో సామూహిక నిశ్చితార్థాలు, వివాహాలకు శ్రీకారం చుట్టాయి. బాలికలను చేరదీసి నిశ్చితార్థాలు జరిపించాయి. దాంతో గ్రామంలో కొంత మార్పు వచి్చనట్లు స్థానికులు చెప్పారు. వ్యభిచారం మాత్రం అంతం కాలేదని అన్నారు. ‘వ్యభిచారుల గ్రామం’ అన్న చెడ్డపేరు తొలగిపోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.    

అసలు తండ్రి ఎవరో..  
వాడియాలో 19 ఏళ్ల ఓ యువతి తన దీనగాథ వినిపించింది. ఆమె అమ్మమ్మ, అమ్మ వ్యభిచారంలోనే మగ్గిపోయారు. అనారోగ్యం పాల య్యేదాకా ఒళ్లమ్ముకున్నారు. ఆ యువతికి మాత్రం ఈ వృత్తి ఇష్టం లేదు. విటులు తమ ఇంటికి రావడం చూస్తూ పెరిగింది. తన అసలు తండ్రి ఎవరో కూడా తెలియదని చెప్పింది. చదువుపై ఇష్టంతో పాఠశాలలో చేరింది. 11 ఏళ్లకు ఆమెకు నిశ్చితార్థం జరిపించారు. నర్సింగ్‌ విద్య పూర్తిచేసింది. 18 ఏళ్లకు వివాహం జరిగింది. వ్యభిచారానికి దూరంగా మెరుగైన జీవితం కోసం ఆరాటపడుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement