పొద్దున్నే లేవలేను.. పోలీసు ఉద్యోగం వొద్దు! | Uttar Pradesh Constable Said He Had A Habit Of Sleeping Till 8 AM, Rejects Police Job | Sakshi
Sakshi News home page

పొద్దున్నే లేవలేను.. పోలీసు ఉద్యోగం వొద్దు!

Jun 27 2025 6:53 AM | Updated on Jun 27 2025 9:19 AM

Uttar Pradesh constable said he had a habit of sleeping till 8 am

డియోరియో: పోలీసు శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో యూపీ పోలీసు నియామకాలు మరోసారి నిరూపిస్తున్నాయి. నాలుగు గంటలకు తాను నిద్ర లేవలేనని, ఈ పోలీసు ఉద్యోగం తనకొద్దని చెబుతున్నాడో పోలీసు. ఉత్తరప్రదేశ్లో కొత్తగా కానిస్టేబుల్‌ నియామకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి నియామక లేఖలు అందుకున్నారు. 

అయితే.. శిక్షణ ఐదవ రోజునే ఓ కానిస్టేబుల్‌ తన తండ్రితో కలిసి డియోరియాలోని ఎస్పీ కార్యలయానికి వచ్చాడు. ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ను కల్పించాలని కోరాడు. కారణం ఏమిటని ఎస్పీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్‌ మహేంద్ర కుమార్‌ అడగగా.. తనకు ఉదయం త్వరగా నిద్రలేవడం అలవాటు లేదని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు... ఉదయం 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉందని, రోజంతా కఠినమైన శిక్షణ తనకు చాలా కష్టంగా ఉందని వెల్లడించాడు. 

తన కుమారుడికి బీఎడ్‌ డిగ్రీ కూడా ఉందని, ఆయన ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటున్నాడని అభ్యర్థి తండ్రి తెలిపాడు. పోలీసు శిక్షణలో శారీరక కఠినత్వం తన కొడుకును పెద్దగా ఉత్సాహపరచలేదని చెప్పాడు. అయితే, కౌన్సెలింగ్‌ నిర్వహించిన పీఆర్వో మహేంద్ర కానిస్టేబుల్‌కు నచ్చజెప్పి ఒప్పించాడు. శిక్షణా సెషన్లలో ఇటువంటి సమస్యలు సహజమని, తరువాత అంతా సాధారణంగా ఉంటుందని చెప్పారు. చివరికి మనసు మార్చుకున్న కానిస్టేబుల్‌ ఎస్పీని కలవకుండానే శిక్షణకు వెళ్లిపోయాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement