జేడీయూ నుంచి వైదొలిగిన ఉపేంద్ర కుష్వాహ | Upendra Kushwaha resigns from JDU, announces formation of a new political party | Sakshi
Sakshi News home page

జేడీయూ నుంచి వైదొలిగిన ఉపేంద్ర కుష్వాహ

Feb 21 2023 5:16 AM | Updated on Feb 21 2023 5:16 AM

Upendra Kushwaha resigns from JDU, announces formation of a new political party - Sakshi

పట్నా: జేడీయూ అసంతృప్త నేత ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిహార్‌ మహాఘఠ్‌బంధన్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు లభిస్తున్న ప్రాముఖ్యంపై అసంతృప్తితో ఉన్న కుష్వాహ గత కొంత కాలంగా జేడీయూ నేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌పై విమర్శలు చేస్తున్నారు.

ఆయన రాజీనామాపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లాలన్‌ స్పందించారు. ‘జేడీయూ నుంచి వెళ్లిపోయి సొంతంగా రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ పెట్టుకున్న కుష్వాహను 2021లో తిరిగి పార్టీలోకి కేవలం సీఎం నితీశ్‌ కుమార్‌ జోక్యంతోనే తీసుకున్నాం. స్థాయికి మించిన ఆశలు ఆయనకున్నాయి. అందుకే వెళ్లిపోతున్నారు’అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement