‘ఆధార్‌’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్‌’ | Sakshi
Sakshi News home page

‘ఆధార్‌’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్‌’

Published Sun, May 26 2024 5:35 PM

UIDAI Clarified On June 14th Dead Line

న్యూఢిల్లీ: ఆధార్‌పై సోషల్‌ మీడియాలో ఇటీవల ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. జూన్‌ 14 లోపు పౌరులు తమ వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఆధార్‌ పని చేయదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(ఉడాయ్‌) కొట్టిపారేసింది.

ఆధార్‌లో కేవలం ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడానికి మాత్రమే జూన్‌14 గడువని తెలిపింది. వివరాలు అప్‌డేట్‌ చేసుకోకపోయినా ఆధార్‌కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. 

కాగా, ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌  వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఈ గడువును రెండుసార్లు జూన్‌ 14 వరకు పొడిగించింది. 

ఈలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement