అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త

Two Years Later, Regular International Flights Resumed on Sunday - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి (ఆదివారం) నుంచి పునఃప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు జరగనున్నాయి. ఈ మేరకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు రెడీ అయ్యాయి. మహమ్మారి ప్రభావంతో ఒడిదుడుకులు గురైన విమానయాన పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ ఆ రంగానికి మరింత ఊతమివ్వనుంది. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు విమానలు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ విదేశీ సంస్థలు సైతం భారత్‌ నుంచి రాకపోకలకు ప్రణాళికలు రచించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20, 2020 నుంచి భారత్‌ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది.  

కడప విమానాశ్రయం నుంచి పునః ప్రారంభమైన విమాన సర్వీసులు
వైఎస్సార్ జిల్లా: కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో విమాన సేవలను ప్రారంభించారు. చెన్నై నుంచి తొలి విమానం కడప చేరుకుంది. అనంతరం కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసు బయల్దేరనుంది. కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు ఇండిగో ఫ్లైట్‌ టికెట్లను అందజేశారు. కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు నేటి నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top