బస్సుల్లో అగ్ని ప్రమాదాలు నివారించే టెక్నాలజీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణ సమయాల్లో ప్రజారవాణా బస్సుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి, నివారించే ‘ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం’ (ఎఫ్డీఎస్‌ఎస్)కు సంబంధించిన డెమోను కేంద్రానికి చూపించింది. ఈ డెమోను సోమవారం∙రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు.
ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ భద్రత కోసం నీటి ఆధారిత ఎఫ్డీఎస్‌ఎస్ విధానాన్ని, ఇంజన్‌లో చెలరేగే మంటలను కట్టడి చేసేందుకు ఏరో సొల్యూషన్ ఆధారిత ఎఫ్డీఎస్‌ఎస్ విధానాన్ని వారికి అధికారులు వివరించారు. æప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగిన 30 సెకన్లలో గుర్తించి 60 సెకన్లలో చల్లార్చే విధంగా నూతన ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్‌ఎస్)ను తయారుచేశారు. ఇందులో భాగంగా బస్సులో 80 లీటర్ల నీటి ట్యాంకును, 6.8కేజీల నైట్రోజన్ సిలిండర్‌ను అమర్చారు. కొత్త విధానం ద్వారా మంటలను 5 సెకన్లలోనే ఆర్పివేయవచ్చు. దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలను రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి అభినందించారు. అనంతరం డీఆర్‌డీవోలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ సిస్టమ్ మోడల్‌ను రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ( పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది: రాజ్‌నాథ్)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి