Tamil Nadu Lockdown: మరిన్ని సడలింపులు.. నేటి నుంచి అమల్లోకి

Tamil Nadu Lockdown: Fresh Relaxations Covid Vaccine Drive Statewide - Sakshi

ఇంటింటికీ టీకా

వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

చెన్నైలో శ్రీకారం  

ఇక, ఆస్పత్రుల్లో 24 గంటల వ్యాక్సిన్‌ డ్రైవ్‌ 

నేటి నుంచి అమల్లోకి మరిన్ని సడలింపులు 

కరోనా థర్డ్‌ వేవ్‌ ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో పాటు.. రెండోదశలో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీనియర్‌ సిటిజన్లకు ఇంటి వద్దనే టీకా వేయాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తూనే సోమవారం నుంచి కోవిడ్‌ ఆంక్షలను మరింతగా సడలించనుంది. 

సాక్షి, చెన్నై : చెన్నై మహానగరంలో 80 ఏళ్లకు పైబడిన వారందరికీ ఇంటి వద్దకే టీకా డ్రైవ్‌కు ఆదివారం శ్రీకారం చుట్టారు. మండలాల వారీగా ప్రత్యేక వాహనాలతో బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ విస్తృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు  2 కోట్ల మందికి పైగా టీకా వేశారు. అందరికీ టీకా లక్ష్యంగా ప్రభుత్వం చర్యల్ని విస్తృతం చేసి ఉన్న నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో తొలి విడతగా 80 ఏళ్లు పైబడ్డ వారికి ఇంటి వద్దకే వెళ్లి టీకా వేయనున్నారు. ఇందుకోసం చెన్నైలోని 15 మండలాల్లో ప్రత్యేక వాహనాలతో బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ బృందాల్ని ఆశ్రయించేందుకు మండలాల వారీగా ఫోన్‌నెంబర్లు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వాహనాలను మంత్రులు నెహ్రు, శేఖర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌ దీప్‌ సింగ్‌బేడీ మీడియాతో మాట్లాడుతూ, కట్టడి చర్యలు విస్తృతం చేయడంతో చెన్నై లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించారు. టీకా డ్రైవ్‌ను విస్తృతం చేయడం కోసం చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంటింటికీ వ్యాక్సిన్‌.. కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా 19 వేల మంది సీనియర్‌ సిటిజన్లకు టీకా వేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.  ఇప్పటి వరకు  చెన్నైలో 25 లక్షల 14 వేల 228 మందికి తొలిడోస్,  10 లక్షల 54 వేల 704 మందికి రెండు డోస్‌ల టీకా వేశామని వివరించారు. గుడిసె ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  

జిల్లా ఆస్పత్రుల్లో.. 
జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం నుంచి 24 గంటల పాటుగా టీకా డ్రైవ్‌ సాగనుంది. ఏ సమయంలోనైనా ఈ ఆస్పత్రులకు వెళ్లి టీకా వేసుకునేందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. చెన్నై  తేనాం పేట డీఎంఎస్‌ ఆవరణలో 24 గంటల టీకా డ్రైవ్‌కు శ్రీకారం చుట్టినానంతరం ఈ విషయంపై ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణ్యన్‌ మాట్లాడుతూ, అందరికీ టీకా లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సెకండ్‌ వేవ్‌ను పూర్తిగా కట్టడిలోకి తెచ్చే విధంగా చర్యలు విస్తృతం చేశామని వివరించారు. ఇది వరకు నిర్ణీత సమయాల్లో టీకాకు తగ్గ చర్యలు తీసుకున్నామని, ఇక, ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి టీకాలు వేయించుకోవచ్చని సూచించారు. 

థియేటర్లలో కోవిడ్‌ జాగ్రత్తలు.. 
సోమవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింతగా సడలించిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లలో ఆదివారం క్లీనింగ్‌ పనులు వేగంగా సాగాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సినిమాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఇక, రాష్ట్రంలో బీచ్‌లు, పార్కులు సందర్శకుల కోసం సిద్ధమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కరోనా నిబంధనలకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి.

చెన్నై మెరీనా తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. ఇక, ఆంధ్రా, కర్ణాటక వైపుగా బస్సుల్ని రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో చెన్నైలోని మెట్రో రైలు సేవలు ఇక, ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు సాగనుంది. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైలు సేవలు సాగుతాయి.  

చదవండి: అద్భుతం: 109 రోజులు వెంటిలేటర్‌పైనే.. చివరకు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-08-2021
Aug 23, 2021, 12:39 IST
సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ 44 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక 18 –...
23-08-2021
Aug 23, 2021, 12:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొద్దిగా...
23-08-2021
Aug 23, 2021, 11:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  25,072 కరోనా...
22-08-2021
Aug 22, 2021, 17:22 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,745 మందికి కరోనా పరీక్షలు జరపగా 1,085 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో 8 మంది మృతి...
22-08-2021
Aug 22, 2021, 12:46 IST
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు...
22-08-2021
Aug 22, 2021, 10:49 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో.. కొత్తగా 30,948 కరోనా కేసులు...
21-08-2021
Aug 21, 2021, 03:21 IST
పన్నెండేళ్లు దాటిన పిల్లలకూ ఇవ్వగలిగిన సరికొత్త కరోనా టీకా సిద్ధమైంది.
21-08-2021
Aug 21, 2021, 00:53 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్‌ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని...
20-08-2021
Aug 20, 2021, 14:32 IST
చెన్నై: ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి.. దాదాపు 109 రోజుల పాటు వెంటిలేటర్‌ సపోర్ట్‌పై ఉన్న ఓ కోవిడ్‌ రోగి ఊపిరితిత్తుల...
20-08-2021
Aug 20, 2021, 13:31 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నేపథ్యంలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. కాగా, అర్ధరాత్రి 11 గంటల...
20-08-2021
Aug 20, 2021, 10:27 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటలలో  కొత్తగా 36,571 కరోనా కేసులు...
20-08-2021
Aug 20, 2021, 06:12 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో వేయించుకోని వారు 3.86 కోట్ల మంది...
19-08-2021
Aug 19, 2021, 03:28 IST
సాక్షి, అమరావతి:  కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి అత్యంత స్వలంగానే దుష్ప్రభావాలు కలిగినట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 53 కోట్ల డోసులకు...
19-08-2021
Aug 19, 2021, 03:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు, వ్యాక్సిన్‌ తీసుకోవాలని పుణేలోని...
18-08-2021
Aug 18, 2021, 07:46 IST
సాక్షి, బెంగళూరు: కరోనా వికృత నీడ విద్యావ్యవస్థను కల్లోలం చేసింది. బాలలు స్కూళ్ల మొహాలు చూడలేకపోతున్నారు. ప్రస్తుత విద్యా ఏడాది...
18-08-2021
Aug 18, 2021, 03:30 IST
►1,119 మంది పీజీ మెడికల్‌ రెసిడెంట్లను కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ విధుల కోసం తాత్కాలిక పద్ధతిన నియమించుకోవాలి. నెలకు రూ.25 వేల...
18-08-2021
Aug 18, 2021, 02:22 IST
వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో మంగళవారం ఒకే ఒక్క కరోనా కేసు బయట పడింది. దీంతో దేశంలో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌...
17-08-2021
Aug 17, 2021, 18:27 IST
కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా అంతమవ్వలేదు. కోవిడ్‌ను అరికట్టేందుకు, మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండేందుకు వ్యాక్సినేషన్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. యువత నుంచి...
17-08-2021
Aug 17, 2021, 10:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా  25,166 కరోనా పాజిటివ్‌...
16-08-2021
Aug 16, 2021, 03:18 IST
‘మాలిక్యులర్‌ ఫార్మింగ్‌’తో మొక్కల్లోనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top