నీట్‌ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్‌ | Tamil Nadu CM MK Stalin Slams Irregularities In NEET Results | Sakshi
Sakshi News home page

నీట్‌ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్‌

Published Mon, Jun 17 2024 6:01 AM | Last Updated on Mon, Jun 17 2024 6:01 AM

Tamil Nadu CM MK Stalin Slams Irregularities In NEET Results

చెన్నై: మెరిట్‌కు కొలమానంగా పేర్కొంటున్న నీట్‌ ఒక కుంభకోణం, ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇటువంటి విధానం అమలును నిలిపివేయాలని ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్‌ చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఈ విధానంతో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పకనే చెబుతోంది.

 సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మరిన్ని దారులు తెరవడానికి బదులుగా వారికి నీట్‌ అవకాశాలను దూరం చేస్తోంది’అని ఆరోపించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్‌టీఏను సమరి్థస్తున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. గుజరాత్‌లో ఓఎంఆర్‌ షీట్లను ట్యాంపర్‌ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కుట్ర. నీట్‌ కోచింగ్‌ సెంటర్లు, ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు, ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరముంది’అని స్టాలిన్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement