నూపుర్‌ శర్మను అరెస్టు చేయాలని పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

Supreme Court Denies Urgent Listing of a Plea That Sought Nupur Sharma Arrest - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. అయితే ఇప్పటికే ఈ పిటిషన్ రిజిస్ట్రార్ ముందు ఉందని,  జులై 11న దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యున్నత ధర్మాసనానికి తెలిపారు.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ వల్ల దేశ, విదేశాల్లో అనిశ్చితి, అశాంతి నెలకొందని పిటిషన్‌ పేర్కొంది. ఆమె వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆమెపై ఫిర్యాదులు నమోదైనా.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి పిటిషనర్‌ తీసుకెళ్లాడు. నూపుర్‌ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించాలని అభ్యర్థించాడు.
చదవండి: సల్మాన్‌ ఖాన్‌ లాయర్‌కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top