నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి?

Speculations rife over BJP fielding FM Nirmala Sitharaman from UP for RS polls - Sakshi

సాక్షి, బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక నుంచి ఈసారి షాక్‌ తగలనుందని సమాచారం. ఆమెకు రాజ్యసభ టికెట్‌ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె యూపీ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది.

స్థానికేతరులు అవకాశమిస్తున్నా.. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు.  జూన్‌ 10న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నేటి (24వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రం తరఫున కేసీ రామ్మూర్తి, నిర్మలా సీతారామన్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ ఇద్దరికీ మళ్లీ టికెట్‌ ఇచ్చే విషయం సస్పెన్స్‌గా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top