సోలార్‌ స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ వేణుగోపాల్‌ను ప్రశ్నించిన సీబీఐ 

Solar Scam Rape Case Congress KC Venugopal Questioned By CBI - Sakshi

న్యూఢిల్లీ: కేరళలో సంచలనం సృష్టించిన సోలార్‌ కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. లైంగికంగా వేధించారంటూ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన మహిళ చేసిన ఆరోపణలపై ఆయన స్టేట్‌మెంట్‌ నమోదు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి వేణుగోపాల్‌తో పాటు కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ, హిబి ఈడెన్‌, మాజీ మంత్రి ఏపీ అనిల్‌ కుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీ అదూర్‌ ప్రకాశ్, బీజేపీ లీడర్‌ ఏపీ అబ్దుల్లా కుట్టీలపై కేసు నమోదైంది.

2012, మే నెలలో జరిగిన సంఘటనపై కేసీ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది సీబీఐ. ఈ కేసును తొలుత కేరళ పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేపట్టింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు విచారణ గతేడాది సీబీఐకి బదిలీ అయింది.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్‌ షాక్‌.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా!

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top