Snake Found in Air India Plane Cargo Hold DGCA Orders Probe - Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశం

Dec 11 2022 6:57 PM | Updated on Dec 11 2022 8:18 PM

Snake found in Air India plane Cargo Hold DGCA Orders Probe - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానంలో పాము కనిపించడం కలకలం సృష్టించింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బీ737-800 విమానం కేరళలోని కాలికట్‌ నుంచి బయలుదేరి దుబాయ్‌ ప్రయాణించింది. శనివారం దుబాయ్‌లో ల్యాండ్‌ అయిన తర్వాత కార్గో విభాగంలో పామును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించేశామని పేర్కొన్నారు.

కాగా.. ఈ ఘటనపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. క్యాబిన్‌లోని పాము ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్‌ ఇండియా అధికారులు వెల్లడించారు. బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement