2 గంటలపాటు చిన్నారి మెడకు చుట్టుకున్న పాము..!

The Snake Crawled Into The Girls Bed While She Was Asleep Scared For Two Hours - Sakshi

ముంబై: పాము పేరు వింటేనే వెన్నులో వణుకు వస్తుంది. ఆ పేరు వినపడగానే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది పాము ఏకంగా మెడకు చుట్టుకుంఏట.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదా. కానీ ఈ సంఘటన వాస్తంగా చోటు చేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఓ చిన్నారి మెడకు చుట్టుకుని ఉండిపోయింది పాము. తీరా వెళ్లే ముందు చిన్నారిని కాటేసి వెళ్లింది.

ఈ సంఘటన మహారాష్ట్రలోని వార్ధా తాలూకా బోర్ఖేడీ-కాలా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బోర్ఖేడీ గ్రామానికి చెందిన గడ్కరీ కుటుంబం ప్రతిరోజులాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. చిన్నారి పూర్వ తన తల్లితో కలిసి నిద్రపోయింది. పడుకున్న కాసేపటికి చిన్నారి తల్లికి ఏదో వెచ్చగా తగిలినట్టుగా అన్పించడంతో  నిద్రలోనుంచి మేలుకుంది. వెంటనే లేచిన ఆమె తమ కుమార్తె పూర్వ సమీపంలో పామును గమనించి పక్కకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది.
చదవండి: పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్‌

పాము చిన్నారి పూర్వ దగ్గర పడగ విప్పి ఉండిపోయింది. అలా ఐదు, పది నిమిషాలు కాకుండా ఏకంగా రెండు గంటలపాటు పాము చిన్నారి వద్దే ఉంది. పూర్వ కూడా మెలకువగానే ఉంది. అయితే ఏ మాత్రం కదిలినా పాము కాటు వేసే ప్రమాదం ఉండటంతో ఆమె అలానే పడుకుని ఉంది. చుట్టుపక్కల వారు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. పాము దానంతట అదే వెళ్లిపోయేంత వరకు నిశబ్దంగా ఉండాలని అనుకున్నారు. 

పాము సుమారు రెండు గంటలపాటు చిన్నారి పూర్వ వద్దే ఉంది. చివరికి పాము వెళ్తూ వెళ్తూ పూర్వను కాటు వేసింది. పాము బయటకు వెళ్లగానే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని సేవాగ్రామ్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 

చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్‌.. కానీ ప్రియుడేమో?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top