పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్‌

Maharashtra Police Saves Woman From Being Run Over By Train - Sakshi

పాలఘర్‌:  ఈ మధ్య కాలంలో పోలీసులు సామాన్య ప్రజలను కాపాడిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యి నెటిజన్లను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన మరో వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. పట్టాలపైకి వెళ్లిన మతి స్థిమితం లేని మహిళను ఓ పోలీస్‌ కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వసాయ్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ సదరు రైల్వే పోలీసు వేగంగా వస్తున్న లోకల్‌ రైలు నుంచి ఒక మహిళను కాపాడుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఆ రైల్వే పోలీసు అధికారిని తెగ మెచ్చుకుంటూ... కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: రూ. కోటి ఇవ్వు లేదా చంపేస్తాం: గ్యాంగ్‌స్టర్‌)

వివరాల్లోకెళ్లితే... మతిస్థిమితం లేని ఓ మహిళ వసాయ్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద  పట్టాల మధ్య నిలబడి ఉంది. ఈ క్రమంలో దహను-అంధేరి లోకల్‌ రైలు వస్తోంది. ఆమె ఎంతకు పట్టాలపై నుంచి బయటకు రాకపోవడంతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపై ఉన్న పోలీసులు ఆమెను గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. నాయక్‌ అనే రైల్వే పోలీస్‌ మోటర్‌ మ్యాన్‌కి రైలు ఆపేలా సంకేతం ఇవ్వమన్నాడు. ఈ మేరకు నాయక్‌ వెంటనే పరుగెత్తికెళ్లి పట్టాలపై ఉన్న ఆమెను ఫ్లాట్‌ఫాం పైకి లాగేశాడు. ఈలోపే రైలు ఆమె దగ్గరి వరకు వచ్చి ఆగింది. ఆ మతిస్థిమితం లేని మహిళ సుభద్ర సింధేగా గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సకాలంలో స్పందించి ఆమెను కాపాడిన నాయక్‌ను పోలీస్‌ ఉన్నత అధికారులు  ప్రశంసించారు.

(చదవండి: గజేంద్రుడి ఆకలి తీర్చిన వృద్ధురాలు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top