రాహుల్‌ సావర్కర్‌ వ్యాఖ్యల వివాదం...తగ్గేదేలే! అంటున్న శివసేన

Siva Sena Leader Sanjay Raut Said Not Compromise Rahul Remark - Sakshi

న్యూఢిల్లీ: ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్‌ పదేళ్లకు పైగా అండమాన్‌ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్‌ అన్నారు.

ఇది కేవలం సావర్కర్‌ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్‌ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు.

అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్‌ గాంధీ తనని ఫోన్‌లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్‌ రౌత్‌ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్‌ రౌత్‌ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉ‍న్న సావర్కర్‌ బ్రిటీష్‌ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్‌ లాల్‌ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్‌ పటేల్‌ వంటి నాయకులు కూడా బ్రిటీష్‌పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్‌ అవమానించినట్లేనని సంజయ్‌ రౌత్‌ ఆరోపణలు  చేశారు. ఏదీఏమైనా రాహుల్‌ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. 

(చదవండి: రాహుల్ సావర్కర్‌ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top