remarks
-
అంత బలుపు వద్దు.. ఓలా సీఈవోపై నెటిజన్ల ఫైర్!
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది. I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024 -
Lok sabha elections 2024: ‘శక్తి’ అంతమే విపక్షాల లక్ష్యం
శివమొగ్గ/కోయంబత్తూర్: ‘శక్తి’ని అంతంచేయడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘శక్తిని అంతం చేస్తామని ముంబై శివాజీ గ్రౌండ్ సభలో విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది. శక్తిని నాశనం చేయడమే వారి లక్ష్యమైతే శక్తి ఉపాసనే మా సంకల్పం. శివాజీ పార్కులో ప్రతి పిల్లాడూ జై భవానీ, జై శివానీ మంత్రం వింటూ, పఠిస్తూ పెరుగుతాడు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ తుల్జా భవానీ మాత ఆశీస్సులతోనే దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు. శక్తిని ఆరాధించారు. ఆయన పేరిట ఉన్న శివాజీ పార్కులోనే శక్తిని అంతమొందిస్తామని విపక్షాలు ప్రతినబూనాయి. ఈ మాట వింటే శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడు ఉద్ధవ్ అదే సభా వేదికపై ఉన్నారు. ప్రతి భారతీయ మహిళా శక్తికి ప్రతిరూపమే. నారీ శక్తికే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. చంద్రయాన్–3 దిగిన చోటుకు శివశక్తిగా నామకరణం చేశాం’’ అని మోదీ గుర్తుచేశారు. ‘‘నారీ శక్తే నాకు నిశ్శబ్ద ఓటరని కొందరు రాజకీయ విశ్లేషకులంటున్నారు. కానీ నా దృష్టిలో నారీ శక్తి అంటే అమ్మవారి శక్తి స్వరూపం’’ అన్నారు. ‘‘అమ్మవారి శక్తి స్వరూపమంటే భరతమాతకు మరో పేరు. కన్నడ కవి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత కువెంపు సైతం కర్ణాటక మాత అంటే శక్తి స్వరూపిణి అన్నారు. ఇండియా కూటమి నేతలు మాత్రం ఏకంగా శక్తినే నాశనం చేస్తామంటున్నారు. ఇది మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లపై, మహిళా సంక్షేమ పథకాలపై దాడి. ధర్మాగ్రహ శక్తే ఉగ్రవాదాన్ని, అరాచకాలను అంతమొందిస్తుంది. ఆ శక్తినే విపక్షాలు సవాలు చేస్తున్నాయి. శక్తి సత్తా ఏంటో, శక్తికి ఎదురెళ్తే ఏమైతుందో ప్రతి మహిళ, కుమార్తె, సోదరీ కాంగ్రెస్‌కు తెలిసేలా చేయాలి’’ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది సీఎంలున్నారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘‘వెయిటింగ్ సీఎం, కాబోయే సీఎం, సూపర్ సీఎం, షాడో సీఎం. అధిష్టానానికి నిధులు పంపించే కలెక్షన్ మంత్రి విడిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి కూడా పైసల్లేకుండా నిధులన్నీ నొక్కేశారు’’ అంటూ దుయ్యబట్టారు. కోయంబత్తూర్‌లో మోదీ 2.5 కి.మీ. పొడవున రోడ్ షో చేశారు. -
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు.. కానీ..
మాలే: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు సిగ్గుచేటు.. జాత్యాహంకారం అని ఆ దేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. బైకాట్ మాల్దీవులు నిర్ణయాన్ని వదిలివేయాలని భారతీయులను అభ్యర్థించారు. "మా దేశ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం అర్థం చేసుకోవచ్చు. భారతీయులు న్యాయబద్ధంగా కోపంగా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు దారుణమైనవి. కానీ ఇవి మాల్దీవుల ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించవు. ఈ వ్యాఖ్యలకు భారతదేశ ప్రజలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు. ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ కూడా స్పందించారు. విదేశీ నాయకులపై ఈ వ్యాఖ్యలు ఆమోదించలేనివని అన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవని చెప్పారు. భారత్‌తో మాల్దీవులు నిర్మాణాత్మక, సానుకూల సంభాషణను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
బిల్లులను అడ్డుకొనే స్వేచ్ఛ గవర్నర్లకు లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్ల తీరుపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారాన్ని దురి్వనియోగం చేయవద్దని గవర్నర్లకు సూచించింది. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో కొనసాగించడం తగదని తేలి్చచెప్పింది. అలాంటి స్వేచ్ఛ గవర్నర్లకు లేదని స్పష్టం చేసింది. ప్రజల చేత ఎన్నిక కాని గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ రాష్ట్రాల శాసనసభల్లో చట్టాలు చేసే ప్రక్రియను అడ్డుకోవడానికి ఆ అధికారాలను ఉపయోగించుకోవద్దని హితవు పలికింది. ఇలాంటి చర్యలు ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేల అధికారాన్ని తగ్గంచేలా ఉంటాయని తేలి్చచెప్పింది. అసెంబ్లీలో తీర్మానించిన నాలుగు కీలక బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 10న 27 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రపతి నియమించే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్ర అధిపతి మాత్రమేనని ఉద్ఘాటించింది. ఈ ఏడాది జూన్ 19, 20వ తేదీల్లో పంజాబ్ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
అరవింద్ కేజ్రీవాల్, ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై గురువారంలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే తగిన చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. "ఆప్ తన అధికారిక హ్యాండిల్ నుండి ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధినేత గురించి చాలా అనైతికమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోధయోగ్యం కావు" అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనైతిక వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు ఆప్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్‌లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. ఇదీ చదవండి: కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం! -
నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్
వాషింగ్టన్: మహిళలపై బిహార్ సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా గాయని, నటి మేరీ మిల్బెన్ ఖండించారు. నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను భారతీయురాలినైతే బిహార్‌కు వెళ్లి సీఎం పదవికి పోటీ చేసేదాన్నని అన్నారు. బిహార్ సీఎంగా పోటీ చేయడానికి ఓ ధైర్యవంతురాలైన మహిళ అవసరమని అభిప్రాయపడ్డారు. "బిహార్‌లో మహిళల విలువలు ప్రమాదంలో ఉన్నాయి. నితీష్ కుమార్ వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ సవాళ్లకు ఒకే ఒక సమాధానం కనిపిస్తోంది. బిహార్‌లో సీఎం పదవికి ఓ ధైర్యవంతురాలైన మహిళ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నేనే భారతీయురాలినైతే బిహార్‌కు వెళ్లి సీఎం పదవికి పోటీ చేస్తా' అని మేరీ మిల్బెన్ అన్నారు. భారతీయులు మహిళల కోసం ఓటు వేయాలని కోరారు. మార్పును ఆహ్వానించాలని ఆకాంక్షించారు. బిహార్‌లో మహిళల అధికారం దిశగా బీజేపీ అడుగులు వేయాలని కోరారు. ఇదే నిజమైన అభివృద్ధని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ సారథ్యంలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భోపాల్: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. "భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయనిధితోపాటు ఏ రాజా, మరో 14 మందికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ వ్యాఖ్యలకు పాల్పడినవారికి నోటీసులు పంపింది. ఈ కేసును విద్వేష ప్రసంగంతో అనుసంధానం చేయడానికి నిరాకరించింది. ఉదయనిధి వ్యాఖ్యలు.. సనాతన నిర్మూళన కాన్ఫరెన్స్‌లో ఉదయనిధి మాట్లాడుతూ.. సనాతనా ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చారు. ఇలాంటి విషయాలను వ్యతిరేకిస్తే సరిపోదని, మొత్తానికి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకమని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన్ను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. ఉదయనిధిని అరెస్టు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
ఎక్కడ ఏవిధంగా ఉండాలో నాకు తెలుసు: రాహుల్‌కి గట్టి కౌంటర్
విదేశాంగ మంత్రి జైశకంర్ ఎక్కడ ఏవిధంగా ఎలా ఉండాలో తనకు తెలుసునంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జైశంకర్. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం కేప్ టౌన్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయ కమ్యూనిటీతో జరిగిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ పేరు ప్రస్తావించకుండా యూఎస్‌లో ఎవరో చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని భారతీయ కమ్యూనిటీ ప్రశ్నించగా..విదేశాంగ మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. తాను విదేశాల్లో ఉంటే తన గురించే మాట్లాడతానని, అక్కడ రాజకీయాలు చేసేందుకు చూడనని చెప్పుకొచ్చారు. అదే స్వదేశంలో ఉంటే మాత్రం వాదిస్తాను లేదా విభేదించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. ప్రజాస్వామ్య సంస్కృతి అర్థం పట్టేలా.. జాతీయ ప్రయోజనం కలిగించేలా సమిష్టిగా పనిచేయడం అనేది ఒక నిర్దిష్ట సాముహిక బాధ్యత అని అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలోన శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన మొహబ్బత్‌కి దుకాన్ కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. బీజేపీ చర్యల ఫలితం భారత్‌లోని ముస్లింలు, దళితులు, గిరిజన ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని, వారి కోసం ప్రేమ, అప్యాయతలతో పోరాడలంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆర్థిక అసమానతలు గురించి కూడా వ్యాఖ్యానించారు. (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర కూటమిపై నేపనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు(ఎన్సీపీ) అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఈ మేరకు అజిత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) అగ్ర నేతలు రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి మద్దతిస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే ఎంవీఏలో సొంత పార్టీ గురించి ఆలోచించకుండా ఎలక్టివ్ మెరిట్ ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంవీఏ నేతలు కలిసి నిర్ణయిస్తారని చెప్పారు. ఎంవీఏ తన ఎమ్మెల్యే, ఎంపీలను ఎలా పెంచాలనే దానిపై చర్చించి కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సందర్భంలో కూటమి ప్రాముఖ్యతను వివరిస్తూ..మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ)లో ఉన్న పార్టీలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవన్నది వాస్తవమని, దీన్ని మనమందరం అంగీకరించాలని పవార్ అన్నారు. ఏక్నాథ్్ షిండే, బీజేపీ కూటమిని ఓడించడానికి తామంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత శివసేన ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటే..మనం కలిసి ఉండాలి, ఎలాంటి పొరపొచ్చా లేకుండా పోటీ చేయాలి. అప్పుడే మనం కచ్చితంగా ఎన్నికల్లో గెలవగలమని చెప్పారు అజిత్ పవార్. కాగా మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. (చదవండి: మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది) -
ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్ ఫైర్
రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అమెరికా, జర్మనీ స్పందించడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం పశ్చిమ దేశాలకు ఉన్న అదొక చెడ్డ అలవాటుగా అభివర్ణించారు. అది తమకు దేవుడిచ్చిన హక్కుల పశ్చిమ దేశాలు భావిస్తున్నాయంటూ చురకలింటించారు. ఈ మేరకు జైశంకర్ బెంగళూరులోని సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని..పాశ్చాత్య దేశాల జోక్యం గురించి, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాల తీరు గురించి మాట్లాడుతూ..నేను మీకు వాస్తవాలు గురించి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంపై పాశ్చాత్యులు వ్యాఖ్యానించడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది..ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసకోవడాన్ని దేవుడిచ్చిన హక్కులా భావిస్తూ..ఇలా చేస్తూ ఉంటే ఇతరులు కూడా ఇలానే చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారి విషయాల్లో జోక్యం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వారు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలరు. రెండోది..భారత్‌లో సమస్యలున్నాయని ఇతరు దేశాలను ఆహ్వానిస్తున్నాం. ఒకరకంగా మట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. ముందు సమస్యలున్నాయని ప్రపంచానికి మట్లాడమని ఉదారంగా ఆహ్వానించడం మానేయాలి. అయినా మీరు(రాహుల్‌ని ఉంద్దేశిస్తూ) ఎందుకు ముందు మాట్లాడటం లేదు. దీని గురించి ఏమైనా చేయొచ్చు కదా. మన సమస్యల్లోకి ఇతరులను ఎందుకు లాగడం. మనం అలా అవకాశం ఇస్తే కచ్చితంగా వారు స్పందిస్తారు. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు కాదు, మనం కూడా. ముందు రెండిటిని సరిచేయాల్సిన అవసరం ఉంది అని శంకర్ అన్నారు. అదే క్రమంలో రాజకీయ పార్టీ ఉచిత పథకాల గురించి ప్రస్తావిస్తూ..ఈ సంస్కృతి ప్రస్తావనపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. వనరులు పెంచే బాధ్యత తమ వద్ద లేదు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు. ఇలాంటి ఉచిత పథకాలతో దేశాన్ని నడపటం సాధ్యం కాదు. ఉచితాలకు ఆధారం ఎవరైనా దాని కోసం చెల్లించుండాలి లేదా దేనినైనా తీసేస్తుండాలి అని అర్థం. ఈ ఉచిత పథకాలతో ప్రజాధరణ పొందడం సులువైన మార్గం కావచ్చు కానీ ఇది ముమ్మాటికీ బాధ్యతరహితమైన మార్గమే అని నొక్కి చెప్పారు జై శంకర్. (చదవండి: ఔను! మేము అధికారం కోసమే కలిశాం: బీజేపీ పై ఉద్ధవ్ థాకరే ఫైర్) -
సావర్కర్‌ను అవమానిస్తే.. దోస్తీ కటీఫ్!
ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే హెచ్చరికలు జారీ చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్(వీర సావర్కర్)ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని.. ఇది విపక్ష కూటమిలో విభేదాలకు దారి తీయొచ్చని సున్నితంగా రాహుల్‌ను మందలించారు. ఆదివారం మాలేగావ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తూ.. ‘‘వీరసావర్కర్ మా దేవుడు. ఆయన్ని అవమానించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మా దేవుళ్లను అంటూంటే మేం చూస్తూ ఊరుకోవాలా?’’ అని థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్ 14 ఏళ్లపాటు అండమాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించారు. అది ఊహాకు కూడా అందనిది. అదొక త్యాగం. అలాంటి త్యాగాలను అవమానిస్తే ఊరుకోవాలా? అని రాహుల్ గాంధీని ఉద్దేశించి థాక్రే ప్రసంగించారు. అయితే.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ, రాహుల్ గాంధీని ఉద్దేశ్యపూర్వకంగా తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని, తద్వారా పోరాట సమయం వృథా అవుతోంది అని ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇదిలా ఇలాగే కొనసాగితే.. విపక్ష కూటమి ముక్కలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చివర్లో హెచ్చరించారు కూడా. తాజాగా అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పేందుకు తానేం సావర్కర్‌ను కాదని, తాను గాంధీనని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పినట్లు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019 కర్నాటక ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలు, పరువు నష్టం దావా.. చివరకు తాజాగా ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది రాహుల్ గాంధీకి. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే ఈ పరిణామాలపై మిత్రపక్షం శివసేన (యూబీటీ) రాహుల్‌కు మద్దతుగా నిలిచింది. రాహుల్‌పై బీజేపీ విమర్శలను స్వయంగా తిప్పికొట్టారు ఉద్దవ్ థాక్రే. ‘‘మోదీ భారతదేశం కాదు. మన స్వాతంత్ర్య సమరయోధులు ఇందుకోసమే ప్రాణాలర్పించారా? మోదీని ప్రశ్నించడం అంటే.. భారత్‌ను అవమానించడం ఏమాత్రం కాదు’’ అని థాక్రే వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికలపై కమల్ హాసన్ కామెంట్ -
సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు!..
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసింది. ఆ ప్రసంగంలో ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందనడంతో.. ఒక్కసారిగా ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.అంతేగాదు ఆమె క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ వివిధ ఊహగానాలు హల్చల్ చేశాయి. ఐతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదని మార్గదర్శక శక్తిగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఆల్కా లాంబా ఆదివారం చత్తీస్‌గఢ్‌లో మూడో రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారే తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదన్నారు. కాగా, సోనియా ప్లీనరీలో..1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి నా ఇన్నింగ్స్ భారత్‌జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉంది. ఈ యాత్ర ఒక గొప్ప మలుపు. మా పార్టీ ప్రజలతో సంప్రదింపులు, సంభాషణల ద్వారా గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి పోరాడటానికి సిద్దంగా ఉందనేది తెలియజేసింది. ఈ యాత్ర కోసం పోరాడిన కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐతే ఆమె పార్లమెంటు సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి బరిలీకి దిగుతారా లేదా తదుపరి లోక్ సభ ఎన్నికలకై కూతుర ప్రియాంక కోసం సీటు వదులుకుంటారా అనే ఊహగానాలు హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..) -
సుష్మా స్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను తానెప్పుడూ భారత దేశ రాజకీయాల్లో ప్రముఖమైన నాయుకురాలిగా చూడలేదన్నారు. ఈ మేరకు తాను రాసిన "నెవర్ గివ్ ఏ ఇంచ్ : ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్"లో సుష్మా స్వరాజ్‌ని కొన్ని అమెరికన్ పదాలతో అవమానకరంగా వర్ణించారు. అంతేగాదు సుష్మా రాజకీయం పరంగా ఆమె కీలకపాత్రధారి కాకపోవడంతోనే మోదీకి అత్యంత సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సన్నిహితంగా పనిచేశానని తన పుస్తకంలో రాశాడు. వాస్తవానికి సుష్మా స్వరాజ్ మోదీ ప్రభుత్వంలో మే 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆమెతో దౌత్యానికి సంబంధించిన విషయాల్లో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఇకపోతే తదుపరి భారత విదేశాంగా మంత్రి.. 2019లో కొత్తగా నియమితులైన జైశంకర్‌ని తాను స్వాగతించానని, పైగా అతను తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు పాంపియో. అతను మాట్లాడే ఏడు భాషల్లో ఇంగ్లీష్ ఒకటని, అది తనకంటే బాగా మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఆయనను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. తన పుస్తకంలో జైశంకర్ వచ్చే 20204 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా చెప్పారు. అతను ఒక గొప్ప ప్రోఫెషనల్, హేతుబద్ధమైన వ్యక్తి మాత్రమే గాదని తన దేశానికే గొప్ప రక్షకుడిగా కూడా అభివర్ణించారు. చివరిగా తాను సుష్మాతో పొలిటకల్‌గా తనతో చాలా ఇబ్బందిపడ్డానని, తనకు ఏవిధంగా సహకరించలేదని చెప్పారు. కానీ జైశంకర్‌తో చాలా సన్నిహితంగా పనిచేయగలిగినట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వ్యాఖ్యలకు జైశంకర్ స్పందించి..తాను పాంపియో పుస్తకంలో సుష్మా స్వరాజ్‌ని అవమానిస్తూ రాసిన వ్యాఖ్యలను చూశానన్నారు. ఆమెను తానెప్పుడూ ఎంతో గౌరవంగా చూసుకున్నానని, అలాంటి ఆమె పట్ల ఇలా అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా, సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆమెను అగౌరపరిచేలా చేసిన సంభాషణనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అంతేగాదు పాంపియో తన పుస్తకంలో భారత్ అమెరికాను నిర్లక్ష్యం చేయడం దశాబ్దాల ద్వైపాక్షిక వైఫల్యంగా పేర్కొన్న విషయంపై కూడా శంకర్ ధీటుగా కౌంటరిచ్చారు. ఇదిలా ఉండగా పాంపియో తన పుస్తకంలో... భారత్ అమెరికా, భారత్ సహజ మిత్రులని నొక్కి చెప్పారు. తమ ప్రజలు ప్రజాస్వామ్య చరిత్ర, ఉమ్మడి భాష, సాంకేతికత తదితర వాటిన్నింటిని భారత్‌తో పంచుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంతేగాదు అమెరికా మేధో సంపత్తి ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న మార్కెట్ భారతదేశమేనన్న విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహాత్మకమైన స్థానం చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి భారత్‌తో దౌత్యాని మూలధారం చేసిందని రాశారు. ఆ పుస్తకంలో తాను ఎంచుకున్న భారతదేశాన్ని అమెరికా తదుపరి గొప్ప మిత్రదేశంగా మార్చడంలో సమయం వెచ్చించండి, కృషి చేయండి అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. (చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు) -
పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జెలెన్స్కీ గురువారం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)లోని వీడియో కాల్లో ప్రసంగిస్తూ..నాకు పుతిన్ బతికే ఉన్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో శాంతి చర్చలు ఎప్పుడూ ప్రారంభమవుతాయన్న అంశంపై ప్రశ్నలు రావడంతో జెలెన్స్కీ ఈ విధంగా స్పందించారు. అయినా పుతిన్ తాను ఉనికిలో ఉండేందుకే ఇష్టపడరంటూ విమర్శించారు. ఆ సమావేశంలోని బ్రేక్‌ఫాస్ట్ ఈవెంట్లో జెలెన్స్కీ మాట్లాడుతూ..ఈ రోజు ఎవరితో దేని గురించి మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన గ్రీన్ స్క్రీన్(శాంతికి)కి వ్యతిరేకంగా కనిపించే పుతిన్ సరైన వారని అనిపించడం లేదు. అసలు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో లేదా అక్కడ ఇంకోకరెవరైనా ఆయన స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ పుతిన్‌పై జోక్‌లు పేల్చారు. మీరంతా యూరోపియన్ నాయకులకు శాంతి చర్చలు గురించి ఎలా వాగ్దానం చేస్తారో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన శాంతి అంటూనే తర్వాత రోజే పూర్తి స్థాయిలో దళాలతో దాడులు నిర్వహిస్తాడు. అందువల్ల తనకు శాంతి చర్చలు అంటే ఎవరితోనో తనకు అర్థం కావడం లేదంటూ జెలెన్స్కీ తనదైన శైలిలో రష్యాకి గట్టి కౌంటరిచ్చారు. జెలెన్స్కీ ప్రసంగం అయిన కొద్ది గంటల్లోనే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "దీన్ని బట్టి రష్యా, పుతిన్, ఉక్రెయిన్, జెలెన్స్కీ ఒక పెద్ద సమస్య అని స్పష్టంగా తెలుస్తోందని గట్టి కౌంటరిచ్చారు. అదీగాక జెలెన్స్కీ మానసికంగా రష్యా లేదా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ప్రత్యక్షంగానే అవగతమవుతోంది. అంతేగాదు రష్యా ఉనికిలోనే ఉంటుంది, తమ దేశ అధ్యక్షుడు పుతిన్ కూడా ఉనికిలోనే ఉంటారు. అదే ఉక్రెయిన్ వంటి దేశానికి మంచిది" అని పెస్కోవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్లింట తెగ వైరల్ అవుతోంది. కాగా పుతిన్ ఇటీవల కాస్త పబ్లిక్ ఇవెంట్లకి దూరంగా ఉండటంతో జెలెన్ స్కీ పుతిన్‌ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీగాక పుతిన్ కూడా డిసెంబర్లో జరగాల్సిన వార్షిక విలేకరులు సమావేశాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు సమాచారం. ⚡️Zelensky refuses to negotiate with Putin because he is not sure that the Russian president is alive. Zelensky said this at the Ukrainian Breakfast in Davos this morning🤣 pic.twitter.com/KphpbM1eND — nicolasorin (@alocin96983806) January 20, 2023 (చదవండి: నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్) -
మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత మైనారిటీ వ్యవహారాల మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మోదీ ఆ సమావేశంలో నేతలను సంబంధంలేని అంశాలపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగానే నఖ్వీ మోదీ ఎప్పుడూ విభేదాలు సృష్టించే వారిని మందలిస్తూనే ఉంటారని, పార్టీ సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించరని చెప్పుకొచ్చారు. ఆయన ఇలాంటి విషయాల్లో నేతలను హెచ్చరించడం మొదటిసారి కాదని, సమాజంలో చీలికలు సృష్టించే వ్యక్తులకు మోదీ తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే తన పార్టీ సభ్యులు ఇలాంటి ప్రకటనలు చేసిన అంగీకరించరని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు పస్మాండ, ముస్లీంలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితరాలను సమగ్ర అభివృద్ధికి బ్రాండ్‌గా విశ్వసిస్తున్నారని చెప్పారు. మోదీ సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తారని నొక్కి చెప్పారు. ఈ సమయంలో ఇంకోవైపు కూడా దృష్ట కేంద్రీకరించాలని అన్నారు. ప్రతి పక్షాలను ఉద్దేశిస్తూ..విషపూరిత కుట్రలపై లౌకిక సిండికేట్ ఎల్లప్పుడూ మౌనంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారంతా ఇలాంటి విషయాలను వ్యతిరేకించరని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మోదీ మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పార్టీ నేతలకు విధ్వంసకర వ్యాఖ్యలను చేయొద్దని హెచ్చరించారు. ఆయన బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కి సంబంధించిన పఠాన్ సినిమా విషయంలో పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, విధ్వంసం నేపథ్యంలోనే ఈ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పార్టీ ఎజెండా గురించి నొక్కి చెప్పారు. అలాగే 2024 జాతీయ ఎన్నికలకు కేవలం 400 రోజులే ఉన్నందున పార్టీ సభ్యులు ప్రతి విభాగానికి సేవ చేయాలని, ఓట్లు ఆశించకుండా అన్నికమ్యూనిటీలను కలవాలని మోదీ కోరారు. (చదవండి: తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్) -
తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు
ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను కోరారు. ఈ మహమ్మారి వ్యాపి చెందకుండా హెల్త్ క్యాపెయిన్లు ఏర్పాటు చేసి తగిన వైద్యం అందించాలని చెప్పారు. అలాగే ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేలా రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. ప్రజల జీవితాలకు భద్రతా తోపాటు మెరుగైనా ఆరోగ్యాన్ని అందించేలా చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు వెల్లువలా పెరుగుపోతుంటే..మరోవైపు ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ వైద్య సేవల కొరత తోపాటు ఔషధాలకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఈ డిమాండ్‌ని తీర్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు శ్మశాన వాటికలకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు సమాచారం. ఒక పక్క కేసుల తోపాటు మరణాలు కూడా అధికమవ్వడంతో శ్మశానాల వద్ద కిక్కిరిసిపోయిన శవాలతో హృదయవిదారకంగా ఉంది. ఐతే డ్రాగన్ దేశం కరోనా మరణాల సంఖ్యలను గణించకుండా కేవలం కోవిడ్ కారణంగా వచ్చిన న్యుమోనియా లేదా శ్వాసకోస వైఫల్య కేసులను మాత్రమే చైనా లెక్కిస్తోందంటూ.. విమర్శలు వెల్లవెత్తాయి. (చదవండి: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థతులు) -
జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌కు కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన జవాన్లకు పిటై అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. "వారంతా అరుణాచల్‌ప్రదేశ్‌లో యాంగ్సేలో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. వారి పట్ల అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదు". అని జైశంకర్ లోక్‌సభలో అన్నారు. ఈ మేరకు విదేశాంగమంత్రి జై శంకర్ సోమవారం లోక్‌సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారు. ఈ ఘర్షణలను తలెత్తకుండా ఉండేలా చైనాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాం. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని బహిరంగంగా ఎందుకు చెబుతున్నాం అని గట్టిగా ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా మాకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత రాహుల్ రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్ చైనా ఘర్షణలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ యుద్ధానికి రెడీ అవుతుంటే మోదీ పాలన నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చూశారు. దీంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..) -
రౌడీషీటర్‌తో బీజేపీ నేతల రక్తదాన కార్యక్రమం...పేలిన మాటల తుటాలు
కర్ణాట బీజీపీ నాయకులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పేరు మోసిన నేరస్తుడు సునీల్ దర్శనమిచ్చాడు. అతను బెంగుళూరులో అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్ కిల్లర్‌గా పరిగణించే సునీల్. ప్రస్తుతం అతను నేర కార్యకలపాలకు దూరంగా ఉంటున్నానని, సమాజ సేవ చేస్తున్నాని చెబుతుండటం విశేషం. ఆ నేరస్తుడు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, చిక్‌పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడహర్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్ఆర్ రమేష్ తదితరులతో ఆదివారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కనిపించాడు. దీంతో అతను బీజేపీలోకి చేరతాడంటూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కర్ణాట బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందిస్తూ... ఈ మిషయమై పార్టీ నేతలను వివరణ కోరతానని అన్నారు. అంతేగాక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నేతలను ఆదేశించామని, అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారిని, నేర నేపథ్యం ఉన్న వారిని పార్టీలోకి తీసుకోమని, ఇలాంటి వాటిని పార్టీ ఎప్పటికీ సహించదని నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శులు ఎక్కుపెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా..పోలీసుల దాడిలో దొరకని రౌడిషీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చారు. గతంలో బెట్టింగ్‌లకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీ పార్టీలో చేరి, మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య కూడా బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో బీజేపీ శివకుమార్ ఒకప్పుడూ గ్యాంగ్‌స్టర్ కొత్వాల్ రామచంద్రకు అభిమాన శిష్యుడంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడూ కొత్వాల్ అభిమాన శిష్యుడు తీహార్ జైలు నుంచి కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదోన్నతి పొందాడని, ప్రస్తుతం అతను పార్టీ అద్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజులను మరిచిపోయారా అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. అండర్ వరల్డ్‌లో పెరిగిన శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, హత్య నిందితులు వినయ్ కులకర్ణి, గూండాయిజంలో పేరుగాంచిన మహ్మద్ నలపాడ్‌లు కర్ణాటక కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారంటూ మొత్తం లిస్ట్ పేర్కొంది బీజేపీ. కాగా, ఇరు పార్టీ మాటల తుటాల దాడి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ...పాత రౌడీషీటర్ల సంఖ్యను తేల్చి చెప్పమని గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా పలు విమర్శలు వచ్చాయి. దీంతో క్రైం బ్రాంచ్ కమిషనర్ ఎన్డీ శరణప్ప ఈ విషయమై వివరణ ఇచ్చారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని స్పష్టం చేశారు. అలాగే రౌడీ షీటర్ సునీల్‌పై ఎలాంటి పాత పెండింగ్ కేసులు లేవని స్పష్టం చేశారు. అంతేగాదు అతను విచారణకు హాజరు కావాల్సిన అవసరం కూడా లేకపోవడంంతోనే ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే రౌడీషీటర్ సునీల్‌ని అదుపులోకి తీసుకులేదని తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం) -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని ఫైర్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ అణ్వాయుధాల సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించుకుంది. తమ అణు కార్యక్రమాలను ఫూల్ ఫ్రుఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షెహబాజ్ ట్విట్టర్లో... అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాక్ బాధ్యతయుతమైన అణుదేశం. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) అవసరాలకు అణుగుణంగా మా అణ్వాయుధాలకు అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఉంది. దీనికి మేము గర్విస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ...జాతీయ ప్రయోజనాలను పరిరక్షించగల బాధ్యతాయుతమైన అణుదేశం పాక్. అన్ని స్వతంత్ర దేశాల మాదిరిగా మా అణుకార్యక్రమాల వల్ల ఏ దేశానికి ముప్పు వాటిల్లదు. మేము ప్రాంతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో యూఎస్‌కి సహకరించాలన్నదే మా కోరిక. దయచేసి అణు సామర్థ్యం విషయంలో లేనిపోని సందేహాలకు తావివ్వద్దు. అలాగే పాకిస్తాన్ తన స్వయంప్రతిపత్తి సార్వభౌమ రాజ్యాధికారం తోపాటు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే హక్కును కలిగి ఉంది అని షెహబాజ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందిస్తూ...బైడెన్ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటూ నిలదీశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో పాల్గొన్న యూఎస్‌లా పాకిస్తాన్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించింది అని ప్రశ్నించారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్
రాప్తాడురూరల్: పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న. ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్ బాషా, మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు. ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! ‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్‌ను ఎన్కౌంటర్ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్‌కు హితవు చెప్పారు. అనంతపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ లిటిగెంట్ భూములను కొనుగోలు చేస్తూ దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్ లేని సిమ్ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. (చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ) -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై... శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
పూణే: లోక్‌సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పాల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్‌ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు. ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు. (చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు) -
అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్! దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
లక్నో: మహ్మద్ ప్రవక్త పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి కార్చిచ్చులా రగిలిపోతుందే తప్ప ఇప్పట్లో ఎక్కడా చల్లబడేటట్లు లేదు. అల్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, సహారన్పూర్లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన వెంటనే నిరసనకారులు పోలీస్‌స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ప్రయాగ్‌రాజ్‌లో ఒక గుంపు కొన్ని మోటార్‌సైకిళ్లను, బండ్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలను ప్రయోగించక తప్పలేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే నిమ్మితం తొమ్మిది మంది పై గట్టిగా లాఠీ ఝళిపించారు. ఐతే ఈ ఘటన తాలుకా వీడియోని బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి సోషల్ మీడియాలో ఇది "అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్" అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రతిపక్షాలు పోలీసుల తీరు పై, బీజేపీ ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.."ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పైగా ఇలాంటి పోలీస్స్టేషన్లను గట్టిగా నిలదీయాలి. కస్టడీ మరణాల్లో యూపీనే నెంబర్ వన్. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘన, దళితులపై వేధింపుల్లో కూడా యూపీనే అగ్రగామిగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ పోలీసు ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి సుమారు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. (చదవండి: బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?) -
ఢిల్లీ పోలీసులకు ఆ దమ్ము లేనట్లుంది: ఒవైసీ
హైదరాబాద్: విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంతో ఢిల్లీ పోలీసులు, ఎంఐఎం చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఒవైసీ.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారాయన. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహమాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా పేర్లను సైతం చేర్చారు. ‘‘ఢిల్లీ పోలీసులు సైడ్‌ఇజం లేదా బ్యాలెన్స్ వాద్ సిండ్రోమ్స్‌తో బాధపడుతున్నట్లు ఉన్నారు. ఒక పక్క ప్రవక్తను బాహాటంగా అవమానించారు. మరో పక్క బీజేపీ మద్దతుదారులను మభ్యపెట్టడానికి.. రెండు వైపులా ద్వేషపూరిత ప్రసంగం ఉన్నట్లుగా చూపిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. 1. I’ve received an excerpt of the FIR. This is the first FIR I’ve seen that’s not specifying what the crime is. Imagine an FIR about a murder where cops don’t mention the weapon or that the victim bled to death. I don’t know which specific remarks of mine have attracted the FIR pic.twitter.com/0RJW1z71aN — Asaduddin Owaisi (@asadowaisi) June 9, 2022 నా వరకు ఎఫ్ఐఆర్లో నేరం ఏంటో కూడా పేర్కొనలేదు. ఇలా ఎఫ్ఐఆర్ను చూడడం ఇదే మొదటిసారి. విద్వేషపూరిత ప్రసంగాలను విమర్శించడం.. విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం ఒక్కటి కాదు. ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై కేసులు పెట్టే దమ్ములేనట్లు ఉంది. అందుకే విషయాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు బహుశా హిందూవాదులను కించపరచకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారేమో అంటూ వరుస ట్వీట్లు చేశారు ఒవైసీ. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేతపై కేసు నమోదు