Short Dress: షార్ట్‌ వేసుకుందని పరీక్షకు అనుమతించని కళాశాల నిర్వాహకులు

Short Dress Weared Girl Exam Not Allowed In Assam - Sakshi

అసోంలోని ఓ కళాశాలలో ఘటన

తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థిని

డిస్పూర్‌: ఉద్యోగ, ప్రవేశ ఏవైనా పరీక్షలకు అడ్డమైన నిబంధనలు విధిస్తున్నారు. రోజుకు పరీక్ష నిర్వాహకులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో పరీక్ష రాసేందుకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, బాలికలకు అయితే తలలో పిన్ను, బొట్టు మొదలుకుని కాలి మెట్టెల వరకు.. అబ్బాయిలకైతే బెల్ట్‌, షూస్‌, ఫుల్‌ షర్ట్స్‌ వేసుకోరాదు వంటి వాటితోపాటు చివరకు జీన్స్‌ ప్యాంట్‌లకు ఉండే బటన్‌లు కూడా ఉండొద్దనే నిర్ణయాలు పరీక్షలకు వచ్చేవారికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.  తాజాగా అలాంటి విధానంతోనే ఓ విద్యార్థి ఘోర అవమానం ఎదుర్కొంది.
చదవండి: నిర్మల్‌ సభలో ‘ఈటల’ స్పెషల్‌ అట్రాక్షన్‌: చప్పట్లు మోగించిన అమిత్‌ షా

అసోంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరీక్షలు మొదలయ్యాయి. సోనిత్‌పూర్‌ జిల్లా తేజ్‌పూర్‌లో ఉన్న గిరిజానంద చౌదరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ (జీసీఐఎంటీ)లో జరిగిన పరీక్ష రాసేందుకు విద్యార్థిని జూబ్లీ తములి (19) వచ్చింది. తనిఖీలు చేసిన అనంతరం ఆమెను లోపలికి అనుమతిచ్చారు. అయితే పరీక్ష హాల్‌లోకి వెళ్తుండగా పర్యవేక్షకులు తములిని ఆపివేశారు. పరీక్షకు అందరినీ పంపించినా తనను ఆపడంపై తములి ప్రశ్నించింది. నువ్వు షార్ట్‌ వేసుకురావడంతో పరీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

దీంతో ఆ అమ్మాయి షాక్‌కు గురయ్యింది. వస్త్రధారణ గురించి ఎక్కడా పేర్కొనలేదు.. పాలన డ్రెస్‌ వేసుకురావాలని ఎవరూ చెప్పలేదని తములి తెలిపింది. అడ్మిట్‌, ఆధార్‌ కార్డు తదితర అన్నీ ఉన్నా కేవలం వస్త్రధారణ సరిగ్గా లేదని అనుమతించకపోవడంపై విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. కంగారుపడుతూ తండ్రి ఒక డ్రెస్‌ తీసుకువచ్చేందుకు మార్కెట్‌కు పరుగెత్తాడు. పరీక్షకు ఆలస్యమవుతుండడంతో ఇదంతా గమనిస్తున్న తోటి విద్యార్థినులు కళాశాలలోని ఓ కర్టెన్‌ తీసుకొచ్చారు.

హాల్‌లోకి వెళ్లిన విద్యార్థిని కర్టెన్‌ కప్పుకునే పరీక్ష రాసింది. బయటకు వచ్చిన అనంతరం తములి కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి ఘోర అవమాన ఘటన నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొలేదు’ అని ఆవేదన చెందింది. ‘షార్ట్స్‌ వేసుకోవడం ఏమైనా నేరమా?’ అని నిలదీసింది. ‘కళాశాల ఒకవేళ పొట్టి దుస్తులు అనుమతించిందని అనుకుంటే ముందే హాల్‌ టికెట్లలో పేర్కొనాలి’ అని పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top