ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్

ప్రత్యేకంగా అభినందించిన కేంద్ర హోంమంత్రి
మళ్లీ గెలిచి రావాలని సూచన
సాక్షి, నిర్మల్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఈటల రాజేందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటల పేరు ఎత్తగానే పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి స్పందన లభించింది. సభ ప్రారంభంలోనే అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఈటల రాజేందర్ పేరు పలికారు. వెంటనే ఈటల లేచి నిలబడగా ‘ముందుకు రాజేందరన్న’ అంటూ అమిత్ షా పిలిచారు. ఈటల కోసం ప్రత్యేకంగా చప్పట్లు కొట్టించారు. ‘రాజేందర్ ఎన్నిక వస్తోంది. రాజేందర్‌ను గెలిపిస్తున్నాం కదా! వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం కదా’ అని అమిత్ షా ఈటలకు కార్యకర్తలతో జేజేలు పలికించారు. ఈ బహిరంగ సభ ఈటల ఎన్నిక సభ మాదిరి కనిపించింది. ఈ సభ ఉత్సాహంతో బీజేపీ, ఈటల రాజేందర్ వర్గం హుజురాబాద్‌లో ఎన్నికలకు సంసిద్ధమవుతోంది.
చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?