వివాదాస్పద‌ వ్యాఖ్య‌లు.. శామ్ పిట్రోడాకు కాంగ్రెస్‌కు కీల‌క ప‌ద‌వి | Sam Pitroda returns to key Congress post month after controversial remarks | Sakshi
Sakshi News home page

వివాదాస్పద‌ వ్యాఖ్య‌లు.. శామ్ పిట్రోడాకు కాంగ్రెస్‌కు కీల‌క ప‌ద‌వి

Jun 26 2024 9:23 PM | Updated on Jun 26 2024 9:23 PM

Sam Pitroda returns to key Congress post month after controversial remarks

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ద‌క్షిణాది భార‌తీయుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి వివాదాన్ని మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శామ్ పిట్రోడా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. భారతీయుల చ‌ర్మ రంగుపై జాతివివక్షతో వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆయ‌న కోల్పోయిన ప‌ద‌వి మ‌ళ్లీ ద‌క్కింది. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా హ‌స్తం పార్టీ తిరిగి నియమించింది.

శామ్‌ పిట్రోడాను తక్షణమే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే నియమించినట్లు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

కాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తూర్పు భార‌తీయులు చైనియుల్లా, ద‌క్షిణాది భార‌తీయులు ఆఫ్రిక‌న్‌ల క‌నిపిస్తారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేగ‌డంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement