శబరిమల ఆలయంలోకి భక్తులకు అనుమతి

Sabarimala Temple Reopens; Kerala Govt Released Guidelines - Sakshi

ఏడు నెలల అనంతరం తెరుచుకున్న శబరిమల ఆలయం

ముందుగా నమోదు చేసుకుంటేనే శబరిమల దర్శనం

కోవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన కేరళ 

ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ

తిరువనంతపురం : దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల పూజ కోసం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని అన్ని ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఆన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కటి మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులోనే పూజల నిమిత్తం శబరిమల తెరుచుకున్నప్పటికీ భక్తులకు దర్శనాలకు అనుమతించలేదు. తాజాగా శనివారం నుంచి ఆగస్టు 21 న నెలవారీ పూజ కార్యక్రమాలు సాయంత్రం పూర్తయ్యే వరకు భక్తులను అనుమతించనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునే వారికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. చదవండి: శబరిమల ఆలయంలో వాటికి అనుమతి లేదు

ఇందులో భాగంగా ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమలలో దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏటా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్న నేపథ్యంలో వీటి గురించి భక్తులకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి కేరళ ప్రభుత్వం లేఖ రాసింది.దీంతో మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం చేసేందుకు దేవదాయ శాఖ నడుం బిగించింది. అలాగే కేరళలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నందున అయ్యప్ప కొంద మీద అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. చదవండి: శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ

మార్గదర్శకాలిలా..
కేరళ పోలీస్‌ శాఖ నిర్వహిస్తున్న వర్చువల్‌ క్యూలైన్‌ వెబ్‌సైట్‌లో ముందుగా భక్తులు నమోదు చేసుకోవాలి. వీరికి ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ విధానంలో దర్శనం కల్పిస్తారు.

 ప్రతి రోజు 250 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

► దర్శన సమయానికి 48 గంటల ముందుగా భక్తులు తమకు కరోనా లేదని తెలిపే నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను చూపాలి. ఇందుకోసం దర్శనానికి అనుమతించే ప్రదేశాల్లో నిర్ణీత ధరకు యాంటీజెన్‌ టెస్టులను చేస్తారు. 

► 10 ఏళ్ల లోపు పిల్లలను, 60–65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనాలకు అనుమతించరు. రేషన్‌కార్డు వంటి గుర్తింపు కార్డులను భక్తులు తమ వెంట తెచ్చుకోవాలి.  
శబరిమల ఆలయంలో నెయ్యాభిషేకానికి, భక్తులు పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతుల్లేవు. ప్రత్యామ్నాయంగా పంబా వంద షవర్లు ఏర్పాటు చేశారు. సన్నిధానం, పంప, గణపతి ఆలయాల్లో రాత్రిళ్లు ఉండటానికి అంగీకరించరు.

► భక్తులు ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే శబరిమలకు చేరుకోవాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top