శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ

Sabarimala Temple Reopens For Monthly Prayers - Sakshi

తిరువనంతపురం: నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని సోమవారం తెరిచారు. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు కొనసాగుతాయని, భక్తులు అనుమతి లేదని దేవాలయ అధికారులు తెలిపారు. నెలవారీ పూజ కార్యక్రమాలు ఆగస్టు 21 సాయంత్రం పూర్తైన తర్వాత ఆలయాన్ని మూసి వేస్తామని తెలిపారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా సబరిమల మినహా దక్షిణ కేరళలోని సుమారు వెయ్యి దేవస్థానాలను ఆగస్టు 27 వరకు తెరిచి ఉంచాలని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయింది. శబరిమల ఆలయాన్ని తెరిస్తే పొరుగు రాష్ట్రాల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదని బోర్డు అభిప్రాయపడింది. ఆగస్టు29 నుంచి సెప్టెంబర్2 వరకు ఓనం పూజల కోసం ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని టీడీబీ తెలిపింది. ఇటీవల సబరిమల వార్షిక పండుగ తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు అధ్యక్షుడు ఎన్‌ వాసు పేర్కొన్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top