మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్‌ భగవత్‌ | RSS Chief Mohan Bhagwat visits Madrasa | Sakshi
Sakshi News home page

మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్‌ భగవత్‌

Sep 23 2022 6:30 AM | Updated on Sep 23 2022 6:30 AM

RSS Chief Mohan Bhagwat visits Madrasa - Sakshi

మసీదులోకి వెళ్తున్న మోహన్‌ భగవత్‌

న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు.

ఆల్‌ ఇండియా ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇలియాస్‌ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్‌ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్‌ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement