
రూ.430 కోట్లు పలకవచ్చని అంచనా
న్యూఢిల్లీ: ఇండోర్, బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్న అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రాబోతోంది. క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో మే 14వ తేదీన ఈ నీలిరంగు వజ్రాన్ని వేలం వేయనుంది. ఈ వజ్రం బరువు 23.24 క్యారెట్లు. వేలంలో 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు.
అరుదైన గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం క్రిస్టీస్ సంస్థ గొప్ప గౌరవంగా భావిస్తోంది. ఇలాంటి అవకాశం జీవితకాలంలో ఒక్కసారే లభిస్తుంది ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. రంగు, పరిమాణంలో గోల్కొండ నీలి వజ్రాన్ని మించింది మరొకటి లేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెల్లరీ రాహుల్ కడాకియా వెల్లడించారు. ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివార్లలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు.