blue diamond
-
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ డైమండ్ల గురించి తెలుసా?
ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటి గోల్కొండ నీలి వజ్రం (Golconda Blue) వేలానికి రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద అయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14వ తేదీన జెనీవాలో జరిగే క్రిస్టీన్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్ లో వేలానికి రానుంది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం తొలిసారి వేలానికి రానుంది .23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలి రంగు వజ్రాన్ని గోల్డ్ రింగ్‌లో అత్యంత అందంగా పొదిగారు. అత్యంత అరుదైన ఈ రత్నానికి రూ. 300 కోట్ల నుండి రూ. 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులుఅంచనా . జెనీవాలో మే 14న జరగనున్న క్రిస్టీస్ ‘మెగ్నిఫిసెంట్ జువెల్స్’ వేలం నిర్వహించనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీస్ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విలువైన వజ్రాల గురించి తెలుసుకుందామా.విలువైన వజ్రాలు, వివరాలుది గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా (కల్లినన్ I) - 1905 లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఈ 530.4 క్యారెట్ల వజ్రం ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద కఠినమైన వజ్రం. కుల్లినన్ వజ్రం నుండి దీన్ని తయారు చేశారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్‌లో భాగం. రాణికి చెందిన రాజదండంపై అమర్చారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద క్లియర్-కట్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి.ది ఓర్లోఫ్ - ది గ్రేట్ మొఘల్ డైమండ్ అని కూడా పిలువబడే అదే వజ్రంగా పరిగణించబడే ఓర్లోవ్ ప్రస్తుతం మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీ డైమండ్ ఫండ్ సేకరణలో భాగంగా ప్రదర్శించబడుతోంది. 1774లో, దీనిని రష్యన్ ఎంప్రెస్ కేథరీన్ ది గ్రేట్ ఇంపీరియల్ స్కెప్టర్లో పొదిగించారు.[1] భారతదేశంలోని విష్ణు విగ్రహం నుండి దొంగిలించబడినట్లు భావిస్తున్న 300 క్యారెట్ల వజ్రం.సెంటెనరీ వజ్రం - 1986 లో దక్షిణాఫ్రికా ప్రీమియర్ మైన్‌లో గుర్తించిన ఈ 273.85 క్యారెట్ల వజ్రం దాని దోషరహిత స్పష్టత మరియు అసాధారణమైన తేజస్సుకు ప్రసిద్ధి చెందింది.ది రీజెంట్ - 17 వ శతాబ్దంలో భారతదేశంలో కనుగొనబడిన ఈ 140.64 క్యారెట్ల వజ్రం ఒకప్పుడు నెపోలియన్ బోనపార్టే కత్తిలో భద్రపరిచారు. ఇది ఇప్పుడు లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శించబడింది.కో-ఇ-నూర్ (కోహినూర్) : ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలలో ఒకటి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం అని అర్థం. భారతదేశానికి చెందిన ఈ 105.6-క్యారెట్ల వజ్రం పెర్షియన్, ఆఫ్ఘన్ ,భారతీయ పాలకుల గుండా ప్రయాణించి బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుని క్రౌన్ జ్యువెల్స్‌లో ఉంది.ఐడల్స్ ఐ - 70.2-క్యారెట్ల వజ్రం ఐడల్స్ ఐ కూడా గోల్కొండ వజ్రమే. 1600లో దక్షిణ భారతదేశంలోని గోల్కొండ సుల్తానేట్‌లో దీన్ని గమనించారు. పురాణాల ప్రకారం, ఈ వజ్రం మొదట పర్షియా యువరాజు రహాబ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత అతను అప్పులు తీర్చడానికి దానిని తన రుణదాతలకు ఇచ్చాడు. ఈ వజ్రం జూలై 14, 1865న లండన్‌లో క్రిస్టీస్ వేలంకోసం ఉంచడంతో ఇది ఉనికిలోకి వచ్చింది. టేలర్-బర్టన్ డైమండ్ - 69.42-క్యారెట్ల పియర్ ఆకారపు వజ్రం, నటి ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్ యాజమాన్యంలో ప్రసిద్ధి చెందింది.సాన్సీ డైమండ్ - రాజ సంబంధాలతో కూడిన 55.23-క్యారెట్ల వజ్రం, ఒకప్పుడు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ చక్రవర్తుల యాజమాన్యంలో ఉంది.హోప్ డైమండ్ - 45.52-క్యారెట్ల లోతైన నీలి వజ్రం. ఇది కూడా భారతదేశంలోనే పుట్టిందని నమ్ముతారు. ఇది ఫ్రెంచ్ విప్లవం సమయంలో చోరికి గురైందనీ, ఆ తరువాత హెన్రీ ఫిలిప్ హోప్ చేత కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీన్ని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఉంచారు.హార్టెన్సియా డైమండ్ - ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్‌లో భాగమైన 20-క్యారెట్ లేత గులాబీ వజ్రం. -
వేలానికి గోల్కొండ బ్లూ వజ్రం
న్యూఢిల్లీ: ఇండోర్, బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్న అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రాబోతోంది. క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో మే 14వ తేదీన ఈ నీలిరంగు వజ్రాన్ని వేలం వేయనుంది. ఈ వజ్రం బరువు 23.24 క్యారెట్లు. వేలంలో 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అరుదైన గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం క్రిస్టీస్ సంస్థ గొప్ప గౌరవంగా భావిస్తోంది. ఇలాంటి అవకాశం జీవితకాలంలో ఒక్కసారే లభిస్తుంది ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. రంగు, పరిమాణంలో గోల్కొండ నీలి వజ్రాన్ని మించింది మరొకటి లేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెల్లరీ రాహుల్ కడాకియా వెల్లడించారు. ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివార్లలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు. -
రూ. 371 కోట్లు పలికిన డైమండ్ .. ఎందుకో తెలుసా!
వజ్రం అంటేనే వ్యాల్యూ ఎక్కువ. అలాంటిది ఇది నీలం రంగు(వివిడ్ బ్లూ) వజ్రం.. పైగా.. 15.10 క్యారెట్లది. దీంతో రికార్డు స్థాయిలో రూ.371 కోట్లు ధర పలికింది. సదబీస్ సంస్థ బుధవారం హాంకాంగ్‌లో దీని వేలాన్ని నిర్వహించింది. రూ.350 కోట్ల దాకా పలుకుతుందని తొలుత అనుకున్నారు. అయితే.. అంతకుమించిన ధర వచ్చింది. 2021లో దక్షిణాఫ్రికాలోని గనుల్లో ఈ వజ్రం దొరికింది. దీన్ని రూ.308 కోట్లకు డిబీర్స్, డయాకోర్ సంస్థలు కొనుగోలు చేసి.. పాలిషింగ్ అనంతరం అమ్మకానికి పెట్టాయి. చదవండి: International Dance Day: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు.. -
ఆ కలర్ వెనుక ఓ కథ
హోప్ డైమండ్.. అత్యంత అరుదైన నీలి రంగు వజ్రం!! భూమ్మీద ఉన్న కోటీ 38 లక్షల వజ్రాల్లో ఇలాంటివి 0.02 శాతమే ఉన్నాయి! ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పుట్టి.. ఎన్నో చేతులు మారి అమెరికా చేరిన ఈ వజ్రం.. ఓ అద్భుతం.. అపురూపం కూడా! వజ్రాలు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా? మొక్కలు నేలలో పెరిగితే.. వజ్రాలు రాళ్లలో పెరుగుతాయి! భూమి లోతుల్లోంచి బయటకొచ్చిన కొన్ని కర్బన స్ఫటికాలు అక్కడి ఒత్తిడి, పీడనాల కారణంగా వజ్రాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పటివరకూ దొరికిన వజ్రాల్లో అత్యధికం తెల్ల రంగువే. కొన్ని ఇతర రంగుల వజ్రాలు ఉన్నా.. నీలం రంగుతో కూడినవి అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల సుమారు 660 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఇవి ఏర్పడే అవకాశం ఉందని నేచర్ పత్రికలో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం తెలియజేస్తోంది. ఇంకోలా చెప్పాలంటే తెల్ల వజ్రాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ తవ్వితేగానీ నీలి రంగు వజ్రాలు దొరకవన్నమాట! ఇంకో విషయం.. వజ్రాలకు నీలి రంగు ఎలా అబ్బుతోందన్న విషయం ఈ పరిశోధన వెలువడేంత వరకూ ఎవరికీ తెలియదు! నీలి రంగు వచ్చేదిలా... వజ్రాలు రాళ్లల్లో పెరిగే క్రమంలో తమ పరిసరాల్లోని కొన్ని ఖనిజాలను తమలోకి కలిపేసుకుంటాయి. నీలి వజ్రాల విషయంలో ఖనిజం ‘బోరాన్’! చిత్రమైన విషయం ఏమిటంటే.. బోరాన్ భూమి ఉపరితలంపై, సముద్రపు నీటిలో మాత్రమే లభిస్తుంది. మరి భూమిలోతుల్లో పుట్టే వజ్రాలకు బోరాన్ ఎలా అంటిందన్న అంశంపై అమెరికన్ జెమలాజికల్ సొసైటీ శాస్త్రవేత్త ఇవాన్ ఎం.స్మిత్ పరిశోధనలు ప్రారంభించారు. హోప్ డైమండ్ లాంటి 46 నీలి వజ్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో వీటిల్లో బోరాన్తోపాటు కాల్షియం సిలికేట్ వంటి కొన్ని ఇతర ఖనిజాలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఇవన్నీ అత్యధిక పీడనం ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడేందుకు అవకాశమున్నవి కావడం గమనార్హం. భూమిలోపలి నుంచి వజ్రాలు ఉపరితలానికి వచ్చే క్రమంలో కాల్షియం సిలికేట్ వంటి ఖనిజాలు పేలిపోయేంత స్థాయిలో అస్థిరమయ్యాయని స్మిత్ తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు... ఈ రకమైన ఖనిజాలు భూమి పొరల మధ్య మాత్రమే ఏర్పడగలవని స్మిత్ అంచనా వేశారు. సముద్ర అడుగుభాగం.. భూమి లోపలి పొర (మాంటెల్) కలిసే చోటే నీలి రంగు వజ్రాలు ఏర్పడేందుకు అవకాశముందన్నమాట! కాలక్రమంలో ఇవి భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్ల కారణంగా పైపొరల్లోకి చేరి ఉంటాయని, సముద్రపు నీటిలోని బోరాన్ చేరడంతో వజ్రాలకు నీలి రంగు వచ్చి ఉంటుందని స్మిత్ అంచనా. కొల్లూరు గని వజ్రం.. ‘హోప్’ హోప్ డైమండ్ కొల్లూరు గనుల్లో పుట్టిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 16–19వ శతాబ్దాల మధ్య ఇక్కడ తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కూడా ఈ గనుల్లోనే దొరికిందని అంచనా. ప్రస్తుతం నిర్మాణమవుతున్న పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో 50 అడుగుల లోతులో ఉండేవి ఈ గనులు. అప్పట్లో గోల్కొండ నవాబుల అధీనంలో ఉన్న కొల్లూరు గనుల్లో ఒకదశలో ముప్ఫై వేల మంది పనిచేసేవారు. అయితే నవాబులు ఈ గనులను వజ్రాల వ్యాపారులు, విశ్వకర్మల కుటుంబాలకు లీజుకిచ్చేశారు. వజ్రాల అమ్మకాల్లో 2 శాతం కమిషన్, పది క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉన్న వజ్రాలు తమకే చెందాలన్నది నవాబులు విధించిన లీజు షరతు! అలా నవాబుల చేతికి చిక్కిన భారీ వజ్రం ఒకదాన్ని 1666 సంవత్సరంలో ఫ్రాన్స్ వజ్రాల వ్యాపారి జీన్ బాప్టీస్ ట్రావెర్నర్ కొనుగోలు చేసి తన పేరు పెట్టుకున్నాడు. ట్రావెర్నర్ ఈ వజ్రానికి సానబెట్టే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లోని నీలి రంగు వెలుగు చూసిందని చరిత్ర చెబుతోంది. 1668 సంవత్సరంలో ట్రావెర్నర్ ఈ నీలి వజ్రాన్ని కింగ్ లూయిస్‌కు అమ్మేశాడు. కొంత కాలం తరువాత ఇది గల్లంతైంది. 1791లో దీన్ని మళ్లీ ముక్కలు చేశారు. అతిపెద్ద ముక్కకు ‘హోప్’అని పేరు పెట్టారు. 1839లో హోప్ పేరున్న బ్రిటీష్ బ్యాంకింగ్ కుటుంబం తమ వద్ద ఉన్న విలువైన వజ్రాల జాబితాలోకి దీన్ని చేర్చింది. హోప్ కుటుంబం నుంచి ఇది చాలాసార్లు చేతులు మారింది. 1958 సంవత్సరంలో హ్యారీ విన్స్టన్ అనే అమెరికన్ వ్యాపారి దీన్ని వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి దానమిచ్చారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
660 కి.మీ. లోతుల్లో బ్లూ డైమండ్
వాషింగ్టన్: అత్యంత నాణ్యమైన వజ్రాలు భూమి అంతర్భాగంలో 410–660 కి.మీ.ల లోతుల్లో ఏర్పడతాయని ఓ అధ్యయనంలో తేలింది. భూమి మీద అత్యంత నాణ్యమైన, ఖరీదైన వజ్రంగా నీలం రంగు వజ్రాన్ని భావిస్తారు. వజ్రాలు, ఇతర రత్నాలు భూమి మాంటిల్ పొరలో ఏర్పడతాయి. అయితే ఈ నీలం డైమండ్ మాత్రం మాంటిల్ పొరకు సుమారు నాలుగు రెట్లు దిగువన ఏర్పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ‘2బీ వజ్రాలుగా పిలిచే ఇవి చాలా ఖరీదైనవి’ అని జెమ్‌లాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాకు చెందిన పరిశోధకులు ఇవాన్ స్మిత్ తెలిపారు. ఈ తరహా వజ్రాల్లో చిన్న చిన్న మినరల్ క్రిస్టల్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్స్‌ను బట్టి 2బీ వజ్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయన్నది తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. బోరాన్ మూలకం వల్లే 2బీ వజ్రానికి నీలం రంగు వచ్చిందని చెప్పారు. -
వేలానికి రూ. 320 కోట్ల వజ్రం
లండన్: తళతళలాడే స్పష్టమైన నీలి రంగు దీర్ఘచతురస్రాకారపు అతిపెద్ద వజ్రాన్ని వేలం సంస్థ క్రిస్టీ అమ్మకానికి పెట్టింది. 14.62 క్యారెట్ల బరువుగల ఈ వజ్రానికి ప్రామాణిక ధరను 320 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి అతిపెద్ద ఫ్యాన్సీ వజ్రం అమ్మకానికి తమ వద్దకు రావడం ఇదే మొదటి సారయితే లండన్‌లోని డైమండ్ సిండికేట్‌ను తన ఆధీనంలో ఉంచుకొని చక్రం తిప్పిన సర్ ఫిలిప్ ఓపెన్ హైమర్ పేరు మీద ఈ వజ్రం ఉండడం మరో విశేషమని వారు వివరించారు. సర్ ఫిలిప్ కేమ్బ్రిడ్జ్ యూనివర్శిటీలో చదవుకోవడమే కాకుండా అక్కడి బాక్సింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఆయన అనంతరం 1934లో కుటుంబపరంగా సాగుతున్న వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా బ్రిటీష్ సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేశారు. తిరిగి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ వ్యాపారంలో గొప్ప ఆర్కిటెక్ట్‌గా, మంచి నెగోషియేటర్‌గా పేరు తెచ్చుకున్న సర్ ఫిలిప్ మొత్తం లండన్‌లోని డమైండ్ సిండికేట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రినౌన్ రేసు గుర్రం యజమానికిగా కూడా గుర్తింపు పొందిన సర్ ఫిలిప్‌కు 1970లో ‘నైట్‌హుడ్’ కూడా లభించింది. ఆయన వద్ద అతిపెద్ద రతనాల కలెక్షన్ కూడా ఉండేది. అంతటి పేరు ప్రఖ్యాతలుగల ఫిలిప్ పేరిట ఉన్న ఈ నీలిరంగు వజ్రానికి మంచి ధర పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కలెక్టర్ వద్దనున్న ఈ వజ్రాన్ని మే 18వ తేదీన జెనీవాలో వేలం వేయనున్నారు.