
వజ్రం అంటేనే వ్యాల్యూ ఎక్కువ. అలాంటిది ఇది నీలం రంగు(వివిడ్ బ్లూ) వజ్రం.. పైగా.. 15.10 క్యారెట్లది. దీంతో రికార్డు స్థాయిలో రూ.371 కోట్లు ధర పలికింది. సదబీస్ సంస్థ బుధవారం హాంకాంగ్‌లో దీని వేలాన్ని నిర్వహించింది. రూ.350 కోట్ల దాకా పలుకుతుందని తొలుత అనుకున్నారు. అయితే.. అంతకుమించిన ధర వచ్చింది. 2021లో దక్షిణాఫ్రికాలోని గనుల్లో ఈ వజ్రం దొరికింది. దీన్ని రూ.308 కోట్లకు డిబీర్స్, డయాకోర్ సంస్థలు కొనుగోలు చేసి.. పాలిషింగ్ అనంతరం అమ్మకానికి పెట్టాయి.
చదవండి: International Dance Day: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు..