తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి! | Seven Killed In Today Road Accident In Tamilnadu Sangam-Krishnagiri Highway - Sakshi
Sakshi News home page

Tamilnadu Road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!

Published Tue, Oct 24 2023 9:22 AM

Road Accident in Tamilnadu - Sakshi

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు  పెరిగిపోతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ఓవర్‌టెక్‌ తదితర కారణాలతో వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(మంగళవారం) తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై వద్ద ఓ టాటా సుమోను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 
సంగం-కృష్ణగిరి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన టాటా సుమోలో ఉన్నవారంతా అసోం రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. వీరంతా తిరువన్నామలై అన్నామలైయార్‌ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆర్‌ఎస్‌ఎస్‌ విజయదశమి వేడుకలు

Advertisement
 
Advertisement
 
Advertisement