ప్రధాని మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు! | Ram Navami: PM Modi, Mamata Banerjee Extend Wishes | Sakshi
Sakshi News home page

Ram Navami: ప్రధాని మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

Apr 17 2024 9:29 AM | Updated on Apr 17 2024 9:54 AM

Ram Navami PM Modi Mamata Banerjee Extend Wishes - Sakshi

దేశంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల్లో అణువణువునా  శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

శ్రీరామ నవ‌మి సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ.. సోషల్‌ సైట్‌ ఎక్స్‌లో.. 'దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ స‌భ్యులకు శ్రీ రాముని జ‌న్మ‌దినోత్సవ శుభాకాంక్ష‌లు. ఈ శుభ సమయంలో నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ సంవత్సరం లక్షలాది దేశప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని చూశాను. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు. 
 

అమిత్ షా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు ‘జై శ్రీరామ్.. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement