
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 51వ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్య కర్తలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కోవిడ్ మహమ్మారితో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బర్త్‌డే వేడుకల్లో పాల్గొనరాదని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో, పార్టీ శ్రేణులు శనివారం సేవా దివస్‌గా పాటిస్తూ ఢిల్లీలోని అంథ్ మహావిద్యాలయంలో విద్యార్థులకు మెడిసిన్ కిట్లు, ఫేస్ మాస్క్‌లు, దుస్తులు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు మహిళా క్యాబ్ డ్రైవర్లకు రేషన్ పంపిణీ చేయడం తోపాటు, ఢిల్లీ జీబీ రోడ్డులో సెక్స్ వర్కర్ల కోసం ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పేదలకు రేషన్ సరుకులు అందజేశారు. రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు అత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేశాయి. రాహుల్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గడ్కరీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: ఇద్దరు సంతానం ఉంటేనే పథకాల లబ్ధి