రాహుల్‌ రెండు వారాల్లోగా తేల్చుకోవాలి | Rahul Gandhi must decide within 2 weeks about Wayanad or Rae Bareli | Sakshi
Sakshi News home page

రాహుల్‌ రెండు వారాల్లోగా తేల్చుకోవాలి

Jun 8 2024 5:34 AM | Updated on Jun 8 2024 5:34 AM

Rahul Gandhi must decide within 2 weeks about Wayanad or Rae Bareli

న్యూఢిల్లీ: రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో నెగ్గిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ సీటును వదులుకోవాలో తేల్చుకోవడానికి మరో 11 రోజులే మిగిలి ఉన్నాయి. చట్టం, రాజ్యాంగం నిబంధనల ప్రకారం ఏదైనా ఒక అభ్యర్థి రెండు చోట్ల నుంచి గెలుపొందితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రెండు వారాల్లోగా ఏదో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పి.డి.టి. ఆచారి శుక్రవారం తెలిపారు.

 17వ లోక్‌సభ రద్దయినా.. కొత్త ప్రొటెం స్పీకర్‌ వచ్చేవరకు స్పీకర్‌గా ఓం బిర్లా కొనసాగుతారని, ఆయనకు రాహుల్‌ తన రాజీనామా లేఖను పంపాల్సి ఉంటుందని వివరించారు. రెండు వారాల్లోగా నెగ్గిన రెండు సీట్లలో ఒకదాన్ని వదులుకోకపోతే.. రెండు సీట్లూ కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆచారి తెలిపారు. రెండుసార్లు గెలిపించిన వయనాడ్‌ (కేరళ), తమ కుటుంబానికి కంచుకోట అయినా రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌)లలో రాహుల్‌ దేన్ని వదులుకుంటారో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement