ప్రేమతో... జామ్‌ | Sakshi
Sakshi News home page

ప్రేమతో... జామ్‌

Published Mon, Jan 1 2024 4:29 AM

Rahul Gandhi cooks orange marmalade with mother at home - Sakshi

న్యూఢిల్లీ: ఎప్పుడూ రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కాసేపు గరిటె పట్టారు. తల్లి సోనియాగాంధీతో కలిసి బత్తాయి జామ్‌ తయారు చేశారు. పెరట్లో పండిన బుల్లి బత్తాయిలతో తయారు చేసిన ఆ జామ్‌ తనకెంతో ఇష్టమని సోనియా చెప్పారు. ఈ ఆసక్తికర వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్‌ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు.

ఇద్దరూ కలిసి తోటలోని బత్తాయిలను తెంపుకొచ్చి జామ్‌ తయారు చేస్తూ తమ ఆహార ఇష్టాయిష్టాలను సరదాగా పంచుకున్నారు. కావాలంటే బీజేపీ వాళ్లకు కూడా జామ్‌ ఇద్దామని రాహుల్‌ అంటే, ‘మనకే తిరిగిచ్చేస్తా’రని సోనియా బదులిచ్చారు. జామ్‌ రెసిపీ తన చెల్లెలు ప్రియాంకదని రాహుల్‌ వెల్లడించారు.

తల్లికి ఒకప్పుడు పచ్చళ్లు నచ్చేవి కావని, ఇప్పుడవి ఎంతో ఇష్టమని రాహుల్‌ అన్నారు. బ్రిటన్‌లో ఉండగా వంట నేర్చుకున్నానన్నారు. తానెప్పుడు విదేశాల నుంచి తిరిగొచ్చినా ముందుగా పప్పన్నం తినాల్సిందేనని సోనియా చెప్పారు. మాటల మధ్యే తయారైన జామ్‌ను ఇద్దరూ కలిసి చిన్న గాజు సీసాల్లో నింపారు. ‘ప్రేమతో.. సోనియా, రాహుల్‌’ అని రాసి స్నేహితులు, బంధువులకు పంపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. 

Advertisement
 
Advertisement