జైలు శిక్షపైనా అప్పీలు!

Qatar court gives former Indian Navy men 60 days to appeal against prison terms - Sakshi

నేవీ అధికారుల కేసులో పురోగతి

న్యూఢిల్లీ: ఖతర్‌లో గూఢచర్య ఆరోపణలపై జైల్లో ఉన్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరింత ఊరట. వారికి విధించిన మరణశిక్షను అక్కడి న్యాయస్థానం ఇటీవలే జైలు శిక్షగా మార్చడం తెలిసిందే.

దానిపై కూడా ఖతార్‌ సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలు కల్పించడంతో పాటు అందుకు 60 రోజుల గడువిచ్చినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైస్వాల్‌ తెలిపారు. 8 మంది మాజీ అధికారుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా జైలు శిక్ష విధించినట్టు చెబుతున్నారు. వాటి వివరాలను ఖతార్, భారత్‌ గోప్యంగా ఉంచుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top